పుట:2015.372978.Andhra-Kavithva.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

భావములు భావనాశక్తి.

203


వంతునిచే మనమును వస్తువులును గూడ సృజింపఁబడుటచే సంభ వించినది. ఏకోదరన్యాయము వర్తించుచున్నది. దూర దేశా గతుఁడగు సోదరునిఁ గాంచినతోడనే ప్రేమ మొక్క సొరీగ ననుభూతమగుచున్నదే. రక్తసంబంధము బహుసూక్ష్మముగ ననుభూత మగుచుండును. కొన్ని యెడలఁ దల్లి బిడ్డలు ఎడ బాటు సనుభవించి ఒకరి మొగముల నొకరు గుర్తింపఁగా లేనంత మారిపోయినను మాతృసహజమగు పాలపొంగు జనించి వారల కుండు రక్తసంబంధమును ఎఱుకపఱచునని మన మెఱిఁగిన సంగతి యే. పిట్టలు, జంతువులు, క్రిమికీటకాదులు, వేయేల? సర్వ ప్రాణులును ఇట్టి రక్తసంబంధమును అనుభవిం చుచు వేనియొక్క రక్తసంబంధుల నవి గుర్తెఱుంగుచుఁ బొర పొటుఁ జెందకయే సుఖదుగఖముల ననుభవించును. వేయిపిట్ట లున్నను జ్ఞాన మంతగా లేనిదయ్యు మగపిట్ట తనతోడిది యగు నాఁడుపిట్టనే సాయంకాలము గూటిలోఁ జేర్చుకొని సుఖమను భవించునే, 'వేరొక పిట్టను జేరనీయ దే? వేయిదూడ లున్నను బశువు దనదూడనే వెదకికొని పాలు చేపునే. ఈ వికారములకు ఈయనిర్వాచ్యసంబంధమునకుఁ గారణము భగవద్దత్త దివ్యజ్ఞాన ముదక్క నన్యము గాదు. భగవంతుని సృష్టి వైచిత్ర్యమే యిట్టి రహస్య సంబంధముల కెల్లఁ గారణము. ఇట్టి దివ్యసూత్రమే సృష్టియం దరాజకము లేకుండ శాంతిని స్థాపించి తుష్టిని సర్వ ప్రాణులకుం బ్రసాదించుచుండును. .

-ప్రకృతికిని మనుజునకును గల రహస్యసంబంధము

.

ఆట్లే ప్రకృతికిని మనకును రహస్య సంబంధము గలదు. అట్టి రహస్య సంబంధమును గుర్తించినవాఁడే రసికుఁ డగును..