పుట:2015.372978.Andhra-Kavithva.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

పంచము

ఆంధ్ర కవిత్వచరిత్రము


దజుముకొని వచ్చుచున్నది. సింగమని గ్రహించి భయభ్రాంతుఁడగునని జేమ్సులాంగల్ మతము, ఈమతమునకు అనేకము లగు పూర్వపక్షములు గావింపంబడినవి. వారితో మనకుఁ బని లేదు.వస్తువును 'గాంచినతోడనే మృగములరీతి నేవో చేష్ట లకు లోనయి మనుజుఁడు భావమును బిమ్మట మానసికముగ ననుభవించు ననుసిద్ధాంతము మనుజుఁడు మృగములనుండి జన్మించుననియుఁ, దత్కారణముగ మృగసహజములగు చేష్ట నే ముందుగఁ బ్రదర్శించుననియుఁ బిమ్మట మృగములకన్న దనమెదడు ఎక్కు డు దట్టముగను నెక్కుడుఁ జమత్కారముగను సృజింపఁబడియుంటచే వానికన్న నెక్కుడు తెల్విగలవాఁడయి. యామృగము లనుభవింపని మానసికవికారమునుగూడఁ దా ననుభవించి మానవసహజమగు జ్ఞానమును వ్యక్తముఁగావించు ననియు డార్విన్ సిద్ధాంతమున కనుకూలముగాఁ జెప్పఁబడినది.

-ఆర్యసిద్ధాంతము యొక్క పరమార్థము,

మన మన్న నో ప్రపంచమంతయు భగవంతునిచే సృజిం పంబడెననియు, భగవంతుని తేజమును ఆత్మయు మనయందును. వస్తువులయందును సయితముఁ గలదనియుఁ, దత్కారణమున మనము వస్తువులఁ గాంచినతోడనే భగవద్ద త్తమగు నాత్మ బలమువలనను, జ్ఞానమువలనను, వస్తువులయం దంతర్గర్బితములయియున్న గుణవిశేషములను, భగవత్తేజమును నవలోకించి. చుట్టము లొకరినొకరు చూచుకొనుతోడ నేసుఖ దుఃఖాదీ భావములకు లోనగుదురో ఆట్లే సుఖదుగిఖాది భావములకు, లోనగుదుము. మనకును వస్తువులకును గల చుట్టరికము భగ