పుట:2015.372978.Andhra-Kavithva.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

అనంతో వైరసః

193


యుండుననియు, జన్మ మెత్తిన కొన్నాళ్ల వరకును . భగవదంశ మును కలిగియే యుండుననియు, వయస్సు వచ్చిన కొలఁది విచారములచే బద్ధుఁడై కుంగుచు భగవంతునికి దూరుఁడగుచున్నాఁ డనియు, శైశవావస్థయే జీవితమున నెల్ల: నుత్తమమగునవస్థ యనియు వర్ణించినారు. భారతీయులలో శిశువులకు మూఁడు మాసములవఱకు భగవదంశము, బూర్వజన్మ జ్ఞానము నుండు నని యొకమతమును, భూమిపై జన్మించి దాది చే జలమునఁ గడగఁబడినని మేషమున నే పూర్వవాసన మరచిపోవునని వేఱొక మతమును కలదు. బర్మాలోని పుంగీలను వారు శిశువు జన్మించి, సప్పు డేడ్చెదరంట. కారణ మది స్వర్గసీమనుండి ఈ పాడుభూలోశమునఁ బడినదనియేనట. అంతియగాక మనుజుఁడు మృతుఁ డగునప్పుడు సంతసిం చెదరఁట. కారణ మతఁడు నిజ నివాసమగు. భగవన్నిలయమున కేఁగు ననియే నఁట.

పాశ్చాత్యులయభిప్రాయము. వర్డ్సువర్తుకవి యభిప్రాయము,

ఆంగ్లేయ కవివరుఁడగు వర్డ్సువర్లు “Ode on the latinations of Immortality" , " అమరత్వ సూచనా ప్రశస్తి" యను శైశవస్తృతి గీతమున నీ భావమునే ఈ క్రిందిపద్యముల వివరించి, నాఁడు.

Our birth.is but a sleep and a forgetting,
The soul that rises with us, our life's star,
Hath had elsewhere its setting,
And cometh from afar:
Not in entire forgetfulness,

ఆంధ్ర కవిత్వ