పుట:2015.372978.Andhra-Kavithva.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంతో వై రసః.

187

కామమునకు జీవసూత్రమునకుఁ గలసంబంధము 

కామము జీవసూత్రము చేఁ గట్టువడియుండును. అనఁగా జీవిత మభివృద్ధి నొందుకొలఁదినిగామ మభివృద్ధినొందుచుండును. జీవిత మభివృద్ధినొందువిధముననే శామ మభివృద్ధినొందును. శామముయొక్క పరిపాటీ వయఃపరిపాకము ననుసరించియుం డును. వయస్సును మీరినకోరికలు గోరువారు ఎచ్చటనై న నున్న ను వా రతీత ప్రకృతు లై యుందురు. అట్టి యతీత ప్రకృతులు సాక్షా ద్వర ప్రసాదులు కావున వాదమునకు లొంగరు. జీవియొక్క ప్రాణ మెట్లు బాల్య యావన-కౌమార. వార్ధక్య - జరా - మరణావస్థల నొందుచుండునో అట్లే కామ మును బాల్య యావన- కౌమార - వార్ధక్య . జరా - మరణా వస్థల నొందుచునే యుండును.

పాశ్చాత్య మనశ్శాస్త్ర సిద్ధాంతములు.

ఈభావము నే పాశ్చాత్యథాస్త్రజ్ఞులు “The Biological aspect of culture"అను పేరఁబిలచుచు నీ భావము ననుసరించి మానవమా నసికాభివృద్ధిని వర్ణించి నిరూపించుశాస్త్రమును “Physiological Psychology" యని పేర్కొ నుచున్నారు. ఈశాస్త్ర సిద్ధాంతమే మన శరీరమును మనస్సును నభిన్న ములును, నభేదములును, నవినాభావ సంబంధముఁ గలవియు ననియు, శరీరము లేనిది. మన స్సుండ నేరచనియు, మనస్సు లేనిది శరీరము వివిధ కృత్యములను జ్ఞానముతో నొనరింప లేదనియు, అందు చేత శారీరక స్థితి నను సరించి మన స్సభివృద్ధి నొందుచుండుననియు, మన స్సభివృద్ధి నొందింపవలెనన్న శరీరమును నభివృద్ధినొందింపవ లెననియు, అనుకూలపరిస్థితులను, అనుకూల పరిస్థితులను ననుసరించి com