పుట:2015.372978.Andhra-Kavithva.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము.


అనంతో వై రసః.

గత ప్రకరణమున రసమునకు మానవజీవితమున ధర్మార్గ కామమోతములలోఁ గ్రామము ఆశ్రయమగుననియు, కవి యధర బోధకుఁడు గాక లోకోపకారియే యనియు నిరూపిం చితిని. ఈ ప్రకరణమున రసమెట్లు జీవితమునఁ బ్రవర్ధిల్లునో, అది యే ట్లనంతవిధముల నొప్పాఱునో తెల్పెదను. రసమనఁగఁ గవి యనుభవించుభావమే యని పూర్వమే చెప్పఁబడినది. అట్లు కవిచే సనుభవింపఁబడు భావములలో నేదైన యొక పద్దతి గోచ రించునా, లేక కవి యడ్డదిడ్డముగ భావముల ననుభవించు చుండునా? రసవిషయమున సహజములగు పద్దతులుగాని, నియమములుగాని కలవా?

రసమునకుఁ గారణములు కవియొక్క జనాంతరసంచిత సంస్కారమును, వస్తుసందర్శనమును నని యొక చోఁ దెల్సి యుంటిని. పిమట రసమునకు మానవసహజమగు కామ మాత్ర యమని నిరూపించితిని. ఈ రెండు సిద్ధాంతములకును నేమైన సంబంధ మున్న దా? అనఁగ' మానవసహజమగు కామము నేయే పద్ధతుల ప్రకారము రసముగా మార్చి వర్ణించును? కోరి కలు రసీకుని చేతులలో నెట్టి మార్పులను, నెట్టియవస్థాపరిణామ ములను బొంది రసస్వరూపముతో బయ ల్వెడలును? ఇట్టిరస స్వరూపములు మితసంఖ్యాకములా యనంతములా?