పుట:2015.372978.Andhra-Kavithva.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

ఆంధ్ర కవిత్వచరిత్రము

తృతీయ


చును. సర్వశాస్త్రములయొక్కయు, సర్వధర్మములయొక్కయు, సర్వమతముల యొక్కయు, సర్వార్థములయొక్కయుఁ బ్రయో జనమును గావ్యము రససాహాయ్యబలమున నతిరమణీయ ముగను హృదయంగమముగను మనోరంజకముగను వర్ణించి ధర్మానురక్తి మానవునియం దుదయింపఁ జేయును.

పాశ్చాత్యుల మతము. 1, ఆర్నాల్డు. 2. వర్డ్సువర్తు.

..

అందుకనియే (Arnold) ఆర్నాల్డను నాంగ్లేయవిమర్శకుఁడు “Poetry is a criticism of life which has the power to sustain, to console and to cheer man with the high ideals of connduct it presents" (కావ్యము జీవితమును విమర్శించి యుత్తమజీవితపథమును జూపించి మానవునకు ధైర్యమును, సంతోషమును, శాంతిని గూర్చుననియు, వర్డ్సువర్తు అనుకవి "Poetry is the breath and the finer spirit of all knowledge, (Words worth) (కావ్యము సర్వశాస్త్రములయొక్క, సారమును, రమణీయస్వరూపమును నై యున్నదనియు వ్రాసిరి.

పూర్వఋష్యాశ్రమములు రసభావపూరితములు.

ఇట్టి రసభావమే ప్రపంచమును నేకముఖమునకుఁ దెచ్చి లోకకళ్యాణమునకుఁ దోడ్పడునని యిదిపటికే విన్నవించితిని. ఇట్టి రసభావమాహాత్మ్యమునే భారతమున నన్నయ కణ్వాశ్ర, మము వర్ణించుపట్టున,

సీ. శ్రవణసుఖంబుగా సామగానంబును
జదివెడిళుకములచదువుఁ దగిలి
కదలక వినుచుండు కరులయుఁ గరికర
శీతలచ్ఛాయఁ దచ్ఛీక రాంబు