పుట:2015.372978.Andhra-Kavithva.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును?

183

ముక్తి యెద్దిరా రక్తి యెద్దిరా?

కావునఁ గవిత్వము సర్వార్ణములసత్ఫలమును, సర్వశాస్త్రముల సారమును, సర్వజ్ఞానసమన్వయమును నని యెఱింగి నీ భ్రాంతి వీడి యుత్తమకావ్యపఠనమువలన రసానుభూతినొంది. రసజగత్తున నిచ్చలు సంచరించుచు నానందముఁగనుము, పోయి వచ్చెదను.

ఆ కావ్యమునకునుశాస్త్రములకును,బరమార్థమున విశేష భేదము లేదు.

రసికునకును సామాన్యమానవునకును' జరిగిన పై సంభాషణమువలన మనకుఁ గ్రోత్తసంగతులు కొన్ని తెలిసినవి. అవియేవన. గావ్యమునకును శాస్త్రములకును దృష్టియందు "భేదమున్నను పద్దతులయందు భిన్న త్వమున్నను, రెండును తుట్టతుద కొక్క పరమార్థమునే సంగ్రహించుటకుఁ దోడ్పడు చున్నవి. కావ్యమునకు శాస్త్రమునకుఁ బ్రబలవిరోధ మున్న దనుటకన్న శాస్త్రములు చేయుపనినే సంగ్రహించు పరమార్గమునే, కావ్య మింకొక పద్దతిని జేసి సఫలము గాంచునని తెలియం దగును, శాస్త్రమున శాసనముల 'నేర్పాటుఁ జేయవలె నసు కాంక్ష యెక్కువగఁ గన్పించును. కావ్యమునఁ బరమార్గము సుందరముగను, నానందజనకముగను, రసవంతముగను జిత్రింపం బడును. శాస్త్రము విధిని షేధములమూలమున ,మానవుని యందుఁ బాపభీతిఁ గలిగించును. కావ్యము రససహాయముతో బుణ్యమునం దాసక్తి గలిగించును. శాస్త్రము నివృత్తిమార్గ మును బోధించును. కావ్యము ప్రవృత్తిమార్గమును బోధిం