పుట:2015.372978.Andhra-Kavithva.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించి కొనును !

175


అని పాశ్చాత్య తత్త్వవేత్తలు వర్ణించినారు. అగును. ఇం దా శ్చర్య మేమి కలదు? జంతుకోటికిని నచల ప్రకృతులకుఁ గూడ భావసుచలన మున్న దనుచున్నా మే యిందులకుఁ గారణము సర్వప్రపంచమును నడపుచుండు కామమేకాని వేరు కాదు. ఏదోయొకళోరిక సర్వప్రపంచమును నావహించుకొనియే 'యుండును. ఈభావమే "ఆశయా ఒద్ద్యతే లోకే కర్తగా బహుచింతయా” యమునార్యవచనమునందునను, “One idea, ave Reality, Ong God, and all creation moves towards it',అని “In memoriam' అనుకావ్యమునఁ జెప్పిన టెన్నీ సన్ కవి వాక్యము నను ధ్వనించుచున్నది. టెన్ని సన్ కవిభావ మేమనఁగ నొకటే భావము, నొకటే సత్యము, నొళఁడే భగవంతుఁడు, సర్వప్రపంచ మును నడపించుచున్నా రనియే. సృష్టి య చేతన కాదనియు, భావపూరితయును, సచేతనయు ననియే.

ఉపసంహారము. -

కావున నింతపఱకుఁ దెలియవచ్చిన దేమనఁగాఁ బ్రపం చము సర్వమును గామముచే నడపింపఁబడుచుండుట చే భావ పూరితమనియు, భావాస్పదముఁ గూడననియు, నందు చే బ్రకృతియందు రసమునకుఁ దావు లేనిపట్టే యుండదనియు, రసప్రవృత్తికి నేయడ్డును లేదనియు, జనాంతర సంచితచిత్తపరి పాకముఁ గలిగినకవికి జగత్తు సర్వమును రసభావోద్దీపకమే యనియు, రసము వినా జగత్తు శూన్యమనియును, కావున నే రసమునకు రసాత్త కమగు కావ్యమునకును మానవధర్మమునం గామమే యాశ్రయ మగును.