పుట:2015.372978.Andhra-Kavithva.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసము దేని నాశ్రయించికొనును !

173


యనియు నతనికి విరుద్దమగు వేఱుపదార్థము లేదనియు, నతనిచే సృజింపఁబడిన సర్వపదార్ధములు నతని తేజముతో నిండియుండు ననియు, నట్టివస్తువు లన్ని టీయందుననుఁ జై తన్య ముండు ననియు, అట్టిచైతస్య బలమున సర్వవస్తువులును ప్రాణులమగు మనయట్ల భావసంచలనముఁ బొందుచునే యుండుననియు, భగ వంతునిసర్వమయత, యచేతనములనీ మనము తప్పఁదలఁచిన వస్తువులపట్లఁగూడ వర్తించుననియు, - అచేతనములు గదా యను తప్పుతలఁపున వానిని హింసించిన వానికి బాధ కలుగు ననియుఁ దెల్పి “తనయందు నిఖిలభూతములందు నొకభంగి సమహితత్వమును జరపువాఁడు” అనుభాగవతవచనము యొక్కయు “ఆత్మవత్సర్వభూతిని" యను నుపనిషద్వాక్యము యొక్కయుఁ బ్రామాణ్యమును ప్రాముఖ్యమును క్రూరులును, రాజ్య కాంక్షా పరులును, హింసారతులును, మాంసాశను లును, నాస్తికులును నగుపాశ్చాత్య శాస్త్రజ్ఞులకును సొశ్చాత్య జనులకును వెల్లడించి భారతీయ విజ్ఞాన ప్రాశస్త్యమును ఘంటా పథముగఁ జాఁటి తన్ను గన్న దేశమునకు ఖ్యాతియుఁ దన కశేష శేముషియును శ్రీవసువు గడించినాఁడు. ,

వాల్మీకి రామాయణమునుండి యుదాహరణములు.

మృగములకును, నదులకును, బర్వతములకును, వృక్షము లకును, లతలకుమగూడ భావసంచలనమును జైతన్యమును నుండుననుటకు వాల్మీకి రామాయణమున "రావణుఁడు కామో “కవశుఁడై సీత నెత్తుకొనిపోవునపుడు అనాథయై విలపించు సీతయొక్క దురవస్థకు మనసులు గరఁగి వాపోవు జంతువుల యొక్కయు నచల ప్రకృతులయొక్కయు విలాపమే నిదర్శనము.