పుట:2015.372978.Andhra-Kavithva.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

ఆంధ్ర కవిత్వ చరిత్రము.

ప్రథమప్రకరణము.


రసాత్మకం వాక్యం కావ్యమ్.

కావ్యమననేమి? ద్వివిధములగు కావ్యలక్షణములు,

సృష్ట్యాదినుండి వివిధ దేశముల వివిధ భాషలఁ గవితం జిప్పినకవి శ్రేష్ఠులు కోటానకో ట్లుండిరిగాని, 'కావ్య స్వభావము పరిపూర్ణముగ నిర్వచించినవారు లేరైరి. దేశ కాలపాత్ర ముల ననుసరించి కవులు భిన్న భిన్నా చర్శములఁ గయికొని "కావ్యములు రచించి యుండుట చేఁ గావ్య స్వరూపము సర్వకాలముల నీట్లేయుండఁదగు నని శాసింపఁబూనుట యెంతయుఁ గష్ట కార్యము. స్థూలముగఁ గావ్యమునకుఁ 'గవికృత గ్రంథ' మను నర్థముఁ జెప్పు. దుము. అంతియేకాని, కావ్యస్వరూపమును శిలాక్షరముల వలెఁ జిత్రింపవలెనన్న నెంతయో విచారము సలుపవలయును. ఈవిచారము ఖండఖండాంతరముల రసిక శ్రేష్ఠులు తమతమ భాషామర్యాదల ననుసరించి సలిపియున్నారు. భరతఖండము సందలి భాషల కెల్లఁ దలమానిక మనఁదగు సంస్కృత భాషను. నీ కావ్య స్వరూపచర్చ మెండుగఁ గావింపంబడినది.