పుట:2015.372978.Andhra-Kavithva.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

147


మునకు లయిల భర్తృవియోగమునొంది మజ్నూనునిపయిం దలఁపుగలుగ నాతనిఁ జూడఁగోరి యాతని వెదకుటకయి యరణ్యములఁ గ్రుమఱుచుఁ దుట్టతుదకు నోళయాశ్రమప్రాంత మునఁ గృశించిన శారీరముతోఁ దపోబలమునఁ బ్రశాశించువదన ముతో ధ్యానమగ్ను డై యున్న మజ్నూ నునిఁ గాంచి చిన్న తనంపుఁ, బ్రేమమంతయు నొక్క-సారిగఁ బై కుబుక నార్ద హృదయయై యాతని నిట్లు ప్రార్థించెను. —

తే. “లయిల నోయి!ప్రియా, కన్ను లారఁ గనవె?”
యనుచుఁ బిలచినకంఠము నాసవాలు
పట్టినట్లుగఁ గనులిట్టె పయికి నెత్తి
చటుకునను మూసి మజ్నూను సంచలింప
కుండ జపమాలికను త్రిప్పుచుండఁ జూచి
లైల యను రాగపపనసంచాల యౌచు
గద్గదక్లాంతి నిట్లనుఁ గరుణ దోప
“గట్టులను పుట్టలను దాఁటి కానసములఁ
గడచి యే,ళ్ళెన్ని యో యీఁది కట్టకడకు
సన్నిధిని జేర ఫలమి దాకన్ను లకును?
మఱచితో గాఢవై రాగ్యపరవశతను
లైల మున్నుండె నీ ప్రియురాలటంచు
లేక ద్రోహాత్మనౌ నాదురాక చేత
భగ్న ప్రణయంపుగాథ జ్ఞాపకము వచ్చి
పొపినౌ ననుఁ గాంచఁగా నోపలేవో?
విధివశతఁ జూపలమ్మున వేరొకనిని