పుట:2015.372978.Andhra-Kavithva.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


దగిలి వారితో వనమునఁ గ్రీడాసక్తుఁడై యుంట కన్నులారఁ జూచి తిరిగితిరిగి యాతనినే ప్రేమించుచున్నది. ఆతనిసౌందర్యము చేతనే చొక్కుచున్నది! అట్లు చొక్క కుండుట వశము గాదనికూడఁ దెల్పుచున్నది! ఆహా! ఏమి యాయనురాగాధిక్యము? స్థాయీ భావలక్షణము పూర్ణముగ వ్యక్తమగుచున్నది కదా! విరుద్ద విషయములను సయిత మాత్మపరముగఁ గావించు శక్తి స్థాయీభావమున కున్న దనుటకు రాధయొక్క ప్రేమయే ప్రబలతార్కాణ మగుంగదా!

3.లైలా-మజ్నూనులకథ, 

లైలా-మజ్నూ నులు పారసీక దేశ పువారు. వీరిరువురును బాల్యమున నొండొరులఁ బ్రేమించి యుండిరి. "కొలవళమున నా బాల్య ప్రవర్తితమగు వీరి ప్రేమలత హఠాచ్ఛిన్న మయ్యెను. తత్ఫలి తముగ లైల వేజోళనిని దలిచండ్రుల నిర్బంధము చేఁ బెండ్లి యాడుట తటస్థించెను. జీవితమంతయు లైలతోఁ గూడ సుఖముగఁ గడపనెంచిన మజ్నూ నునకు లైల యన్యుని వివాహ మగుట వజ్రపాత నిభమయ్యెను! జీవితసాఫల్యము లైలరౌఁగి లియే యని యువ్విళ్లూరుచుండిన మజ్నూను లైల యన్యునిఁ జే పట్టెనని విన్న తోడనే హతాశుఁడై భగ్న మనోరథుఁడై స్వబంధు జనమును, స్వదేశమును, స్వగృహమును వీడి పిచ్చివానీపలె నడవుల సంచరించుచుండెను. అందుకనియే యాతనికి మజర్నా నని పేరువచ్చెను. మజ్నూ ననఁగఁ బారసీక భాషయండు నున్నత్తుఁడని యర్థము, అడవులు గుమఱుచు నెల్లప్పుడును లైలా ముఖబింబ లావణ్యమునే స్మరించుచు, లైలా నామమునే జపించుచుఁ దపోనిష్ఠ గలవాడై యుండెను. ఇట్లుండఁ గొంతకాల