పుట:2015.372978.Andhra-Kavithva.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


యున్న రాధకు ముందు శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహము గోచరించెను. తోడనే యామె ప్రాణములకునై తము వెరవక శ్రీకృష్ణు నాశ్లేషించుకొనునాసతో ముందంజ వేయఁ బోయెను. సామాన్యాభిసారిక యంతటి ప్రాణాపాయమునకుఁ దెగించునా? రాధ తెగించెను. ఏల? శ్రీకృష్ణగా త్రపరిష్వంగ సుఖ మెక్కువయా? తద్విరహితములగు ప్రాణము లెక్కువయా? 'రాధకు మనోనిశ్చయము కుదిరెను. శ్రీకృష్ణుడు మెచ్చెను భక్తపరాధీనుఁడగు శ్రీకృష్ణుఁడు భక్తాగ్రగణ్బు రాలగు రాధ యొక్క నిష్కల్మష హృదయమును మెచ్చి యామెతపోనిష్ఠకు సంతసించి యామే కభీష్టసిద్ది గావించెను. రాధను శ్రీ కృష్ణభగ వానుఁడు హృదయసమాను రాలగు ప్రేయసిగ నంగీకరించి, యామేయ భీప్సితమును నెజవేఱ్చి యామెజీవితమును సఫలము గావించెను

ఆట్లు శ్రీకృష్ణుని చేఁ బరిగ్రహింపఁబడి, లాలింపఁబడి, యతనిచే భార్యలందఱకన్న నెక్కుడు ప్రేమతోఁ జూడఁబడి, రాధ పరితుష్టహృదయ యయ్యెను. ఆమె చేసిన తపస్సు ఫలిం చేను. శ్రీకృష్ణుఁడాపె వాఁడయ్యెను. ఇందుల కొక్కదీన్ని యుదాహరణముఁ దెల్పెద! రాధ యొకనాడు శిరముపై బెరుగు ముంతల నిడికొని వీథి నమ్ము కోసం బోవుచుఁ బెరులో యమ్మ పెరుగు, పాలోయమ్మ పాలు' అంచు గేకలిడుటకు మారు మాధవా! గోవిందా! యనుచుఁ బ్రేమామృతపాన మత్తయై పలువరింపసాఁగెను. ఆహా! రాధ, శ్రీకృష్ణునిపయిఁ బ్రేమచే నెంతయవశయయినది? రసపొరవళ్యమన్న సద్దియేకదా!