పుట:2015.372978.Andhra-Kavithva.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ.


ములను లక్ష్యమున నుంచుకొని దశావస్థలలోఁ దగినవానిని ననుభవించునట్లు చేయఁదగును. సింహమునకు మృగరాజు ఠీవియు, మత్తేభహననశక్తియు నేయవస్థాదికమును గ్రమాంతర ముగ ననుభవించుటచేఁ గలిగెను. మత్తేభమును జూచిన తోడనే కుంభస్థలము పైకుజీకి దానిని జీల్చి యందలిమాంసమును భుజించుగుణము సింహమునకుఁ బుట్టుకతోడనే జనించును. ఈ స్వభావమే 'పులిపిల్ల పులిపిల్ల యే, మేఁకపిల్ల మేఁక పిల్ల యే' అనులోక్తి గన్నది. తోఁకఁ దొక్కినతోడనే త్రాచుఁబాము కాటువేయునుగాని మానునా? తోఁకఁదొక్కిన మనుజుని గాటు వేయఁ బ్రయత్నించుటకు నాగుఁబామేయే యవస్థాదిక క్రమము ననుభవించును? తొక్కుడు పడుటయుఁ గాటొందుటయు నేక నిమేష జనితము లే.

అవస్థాశ్రమ మవశ్యానుభవనీయము గాదు.

కావున నింతకును జెప్పవచ్చిన దేమనఁగా : జన్మాంతర సుస్కారము ననుసరించి జీవికి రససిద్ది వివిధావస్థాశ్రమము ననుభవింప నవసరము లేకయే జనించును. జన్మాంతర సంస్కారము లేనివారికి వివిధాపస్థానుభవము రససికిఁ గారణభూత మగుఁగాక ! కావున నీయవస్థాశ్రమమంతయు వివేచనాబలము "నను, విమర్శన బలమునను దోఁచవలసిన దేశాని, కావ్యమున సంపూర్ణముగను నావశ్యకముగను వర్ల నీయముగాదు. రపాను భూతిలో మనలాక్షణికులు సూచించినయవస్థా క్రమ మంతర్గర్భితముగను, సూచీతముగను నుండవచ్చును. కాని, రసాను భూతి మాత్రము తప్పనిసరిగ నీయవస్థాక్రమము తప్పకుండ ననుభవించి తీజవలయుననుట భ్రమ ప్రమాదము. పాశ్చాత్య