పుట:2015.372978.Andhra-Kavithva.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూప నిరూషణము.

123


స్వరూపమును స్వవిషయమును స్వోత్మోపలబ్దియు గ్రహింపని వారై జీవితములఁ జాలించువా రెంఱునుగూర్చి మనము వినియుండ లేదు? ఈభావమునే వర్డ్స్ వర్త్ అనునొకయాంగ్లేయ కవి మైకల్ అనుకావ్యమున వృద్ధులగు గొల్లదంపతులజీవిత మును వర్ణించుచు వారియనురాగమును ప్రశంసించుచు క్రింది విధమున వ్రాసెను.

"Thus, living on through such a length of years, The shepherd if he loved himself, must needs. Have loved bis helpmate."

(అనఁగా నన్ని యేండ్లు కాఃపురముఁ జేసినవాఁడగుటచే మైకేలు తన పెండ్లమును బ్రేమించియే యుండవచ్చును. తన్ను - దాను బ్రేమించుకొన్న యెడలఁ దన పెండ్లమును గూడఁ బ్రేమించియే యుండును. అని పై మాటలభావము.) మన పెద్దల కాలమున నిప్పటి భావోద్వేకమును నిప్పటి రసావేశమును దక్కువగనే యుండెను. ఇప్పటి కాలముననో యువతీయువకులు అవాచువ్వలుఁ బోలె భావోద్రేకమున రివ్వున బైకెగయు చుందురు. చూచుటతోడనే రసావేశము ననుభవించు ప్రణయినులు నేటికాలమునఁ జాలమంది గలరు. అట్టిరసహృదయులకుఁ జూచుటయు, భావానుభూతి ' నొందు టయు, రసపారవశ్యము నందుటయుఁ గూడ నేకక్షణ జనితములే యగును. వారికి మనయాలంకారికులుప దేశించిన దశావస్థల యసుభూతి క్రమాంతరముగ లభియింప నక్కలు లేదు. దశావస్థలయంత్య పరిణామమనఁదగు రససారవశ్యమును రససిద్దియు నేకక్షణముననే లభ్యమగును. అందులకనియే కవి పాత్రములయొక్క శక్తులను, జిత్తవృత్తులను, జిత్తసంస్కార