పుట:2015.372978.Andhra-Kavithva.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ



సంస్కార బలమున నాత్మ కును వేవోకయాత్మకును సంబంధ మేర్పడును. ఆసుబంధము వలననే ప్రేమ జనించునని సూచింపఁ 'బడినది. ఆత్మకు నాత్మకుఁ గలయనిర్వాచ్యమును నకారణ జనితమును నగు సంబంధమే ప్రేమకుఁ గారణ మగునను భావము పరిస్ఫుటమగు చున్నది. కావున భావానుభూతీకి జన్మాంతరలబ్దమగు చిత్తసంస్కారమే కారణమనియు, బాహ్యకారణ ములు సూచింపఁ బ్రయత్నించుట యప ధానవిషయము నాధారముగఁ గొనుటయే యనియు స్థిరమగుచున్నది.

స్థాయీభావము-ఆలంకారిక నిర్వచనములు.

అకారణజనితమగు నీభావానుభూతియే వివిధావస్థల ననుభవించి విభావాదికముల పరామర్శనొంది స్థాయీభావము నొందునని తెల్పియుంటిమి. అట్టి స్థాయీభాప తత్త్వమును బరిశీలింతము. ముందు స్థాయీభావమునకు లాక్షణికు లొసంగిన నిర్వచనములఁ బరిశీలించి, పిమ్మట సోదాహరణముగ దాని తత్త్వముఁ జర్చించి, రసస్వరూపము నిరూపింతము. సుప్రసిద్ధ నిర్వచనముల రెండిటి నుదాహరించెదను:--

 విరుద్ధైరవిరుద్ధైర్వా భావై ర్విచ్ఛిద్య తే న యః
ఆత్మ భావం సయత్యన్యాన్న స్థాయీ లవణా కరః,
సజాతీయై ర్విజాతీయైరతిరస్కృతమూర్తిమాన్,
యావరసం వర్తమానః స్థాయీభావ ఉదాహృతః.

(రసగంగాధరము.) పై రెండు నిర్వచనములలో మొదటిది రసవత్తరముగను, భావగంభీరముగను నున్నది; రెండవది వ్యాఖ్యానరూప ముగ నున్నది. మొదటి నిర్వచనమున స్థాయీభావము లవణా