పుట:2015.372978.Andhra-Kavithva.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

107


యుండును. అదియే జీవసూత్ర మనఁ జెల్లును. ముందుగ భావ మన నేమో పిమ్మట స్థాయీభావమన నేమో స్థాయీభావమే యేట్లు రసమునకు సిద్ధియగునో విచారింతము.

భావమును లాక్షణికు లీ క్రింది విధమున నిర్వచించిరి: “సుఖదుశిఖాది కై ర్బావై ర్భావ సద్భావభావసమ్.” “దృష్టికి గోచరములగు వస్తువులదర్శనమువలన జనించిన సుఖదుఃఖాది భావములచే హృదయా వేళమునొందు నవస్థయే భావమగును, ఇయ్యది భావన, వాసన యనుపదముల నుండి జనించినది. ఇతర వస్తువులకు సైతము సువాసన నొసఁగుభావమే యిచట గ్రాహ్యము” దీనితాత్పర్య మిట్లు చెప్పఁదగును. కన్నులకు గోచరించువస్తు. వులదర్శనమువలన మానవునకు సంతోషముగాని, దుఃఖము. గాని జనించును. అట్లు జనించిన సుఖముగాని దుఃఖముగాని హృదయము నా వేశించినచో నయ్యదియే భావమగును. అట్టి • భావావేశమువలన మిగిలిన వస్తు జాలమంతయు భావానుగుణ దగురూపమును దాల్చును. అదియే భావన. అట్టి భావనయొక్క విజృంభణమే భావనాశక్తి యనఁ బరగును. అట్టి భావనాబల మునఁ గవి 'కావ్య నిర్మాణముఁ గావించి ప్రకృతియందునను మానవ జీవితము నందలి వివి ధావస్థలయందునను సౌందర్యమును బ్రదర్శించి స్వయముగ నానందము ననుభవించి యితరుల నానందము ననుభవింపఁ జేయును. భావనాశ క్తి ప్రశంస యిండొకచో విరళముగఁ జేయుగము. ప్రకృతము భావమునకును, రసమునకును గల సంబంధమును విచారింతము,