పుట:2015.372978.Andhra-Kavithva.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ఆంధ్ర కవిత్వ చరిత్రము

ద్వితీయ.


దము. చిత్రములయందును, శిల్పములయందును మానవ ప్రకృతి యందుఁగాని, బాహ్య ప్రకృతియందుఁగాని కలసౌందర్య భావా నుభూతి నిశిత లైన్ల్యమునొందు నవస్థలో ప్రదర్శితమగును.

2.చిత్రశిల్పము లింద్రియసాహాయ్యము చే రసమును బ్రదర్శింపఁగల్గును. కావ్యము ఇంద్రియ సాహాయ్య మపేక్షింపనిశుద్ధమానసిక వ్యాపారమే.

చిత్రమునందును, శిల్పమునందును పలుషూటల కవకాశము లేదుగావునఁ 'జెప్పఁదలఁచుకొన్న భావమంతయు నేక స్థాయి నుండునట్లుగను, నిశితతీక్షతఁగలుగునట్లుగును బ్రదర్శింప వలయును. ఒకటే దెబ్బ రెండే తునుక లనునట్లు, చిత్ర కారుఁ డును, శిల్పియును నిశితతీక్ష తఁ గలస్థాయీభాపమును మాత్ర.. మే ప్రదర్శింతురు. అందు చేత నే చిత్రములును శిల్పములును భావతీక్షతఁ గలవై కొట్టవచ్చినట్లుగ నుండి చూపఱమనంబుల నొకేచూడ్కితోనేవశము గావించుకొనఁ గల్గుచున్నవి. శిల్పము నందును జిత్రమునందును వైవిధ్యమున " కవకాశము లేదు. భావతైక్ష్యమే చిత్ర కారునకును, శిల్పికిని బరమావధి. ఇఁకఁ గావ్యముననన్న నో వైవిధ్యమున కవకాశము గలదు.

చిత్రములయందును, శిల్పములయందును గలరసము. చక్షురింద్రియము ద్వారా మనసునకు గోచరించును. అందుచేఁ గన్ను లకుఁ జూచినతోడనే ఒక్క మాటుగ రసము గోచరించు టకై రసము నిశిత తైక్ష్యముతోడను నేకాగ్రతతోడను నొప్పునవస్థయే చిత్ర కారులును శిల్పులును ప్రదర్శింతురు. ఆ నిశితతీక్షత గలభావమును గన్నులు మనసునకు గోచరింప