పుట:2015.372978.Andhra-Kavithva.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసస్వరూపనిరూపణము.

87


భూతము గాదనియు, కవియొక్క దృష్టి యే దేనివస్తువుపై బ్రసరింపనిది నిరాధారముగా నిష్కారణముగా రసముజనింప నేరద నియు, జనియించురసము తనంతటఁదాను వ్యక్తముగా లేక కవి ద్వారమున నే వ్యక్తము గావలెననియు, ముఖ్యమగు భావము నిర్వచనము స్ఫురింపఁ జేయుచున్నది. కవియొక్క పరిపాకము, వస్తువు యొక్క 'యాలంబనము, 'కావ్యము యొక్క రససంవాహ శత్వమును, నీనిర్వచనమున ముఖ్యముగ సూచింపఁబడినవి. ఇం దొకవిశేషముగూడ గమనింపఁదగియున్నది. అదెద్దన వస్తువు కవి చిత్తపరిపాకమున కాలంబన మైనంతమాత్రముగనే కవి యొక్కయుపజ్ఞ కుసు, సపూర్వస్వతంత్ర కల్పనా ప్రతిభకును నిరోధము సంభవింప నేరదు. వస్తువు గుణ విశేషణములకును, గవియందు జనించు భవమునకును గార్య కారణసంబంధ ముండ నవసరము లేదు. అనఁగా కవి పస్తువును సాధార మాత్రముగఁ గొని యపూర్వములగు కల్పనల: గావించి కీర్తి గడించవచ్చును. "కాని ముఖ్యముగ సూచితమగు నర్థమేమనఁగా గవి మనము నందు వస్తుసందర్శన బలమున జనించు భావోద్రేకమే భావాను భూతియే రసమని,

భావానుభూతియే రసమునకు జన్మ కారణము,

ఈనిర్వచనపుంబరిణామము కావ్య కల్పనావిషయమున నెట్లుండును? కవి ప్రకృతిదర్శనముసు, మానవజీవితము నందలి వివిథావస్థలజ్ఞానమును ననుభవమునకుఁ దెచ్చికొనకుండఁ గననము నల్లఁ భారంభించిన రసనిష్పత్తి కానేరదని తేలుచున్నది. భావానుభూతి రసమునకు జన్మ కారణము. ఊహ తర్క సిద్దాం తాదులవలన రసనిష్పత్తి కానేరదు. భావానుభూతియే రసము