పుట:2015.372412.Taataa-Charitramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార్పొ రేషనులో సభ్యుడగుట కెన్నడును తలపెట్టలేదు; కాని చాలకాలము బొంబాయిలో గౌరవన్యాయపతిగ మాత్రము పనిచేసెను.

బొంబాయి పరిసరపు నివేశనస్థలములపైన లోగడప్రభుత్వమువారు హెచ్చుపన్ను విధించినప్పుడు, జంషెడ్జి ప్రభుత్వమువారితో తీవ్రచర్చజరిపి, ఆపన్నును తగ్గించుటకు పత్రికలందుగూడ చాల వ్యాసముల మూలమున నాందోళనసలిపెను. ఆయన బొంబాయిపురము పురోభివృద్ధికి సంబంధించు విషయములన్నిటిలోను శ్రద్ధవహించెను. మిల్లులందు బట్టలతయారుచేయుట ఆనగరపు ముఖ్యపరిశ్రమ; అందుల ప్రతిసమస్యలోను పాల్గొని, ఆయన నాయకుడయ్యెను; తనమిల్లులలాభముకే యత్నింపక, నగరముకంతకు లాభించునట్లే కృషిసలిపెను. తనమిల్లులందు యువకులకు సాంకేతికవిద్యను, యంత్రములనడుపు పద్ధతులను, ఆర్థిక వ్యాపారవిధానములను, ఉచితముగ నేర్పుచుండెను.

పౌరాభివృద్ధికి విద్యాసౌకర్య మవసరము; తన యాదాయములో కొంతభాగమును తాతా విద్యాపోషణకై వినియోగించుచుండెను. ఆర్థికవిషయము లందాసక్తి కలిగియుండుట బట్టియు, తనయనుభవమును బట్టియు, నాణెములు వెండిబంగారముల దామాషా రేటు బాంకుపద్ధతులు మున్నగువాని గూర్చి, ఆయన సలుపువిమర్శలును జ్ఞానదాయకములై యుండెను. బొంబాయిలో తనకుమారునిచే కొన్ని వార్తాపత్రికల నడిపించి,