పుట:2015.372412.Taataa-Charitramu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్ధతి, అధికారవ్యవహారములు, భారతీయములే; ఏవైపునుండి చూచినను, ఈప్రసాదరాజ మతిసుందరముగ కనబడును. ఇందు దీపములు, వంట, వేడినీటిసప్లై, బట్టలయిస్త్రి, పై అంతస్థుల కెక్కుట, మున్నగు సౌకర్యములన్నియు, విద్యుచ్ఛక్తిమూలముగనే జరిపించబడును. మరియు పోస్టాఫీసు వైద్యసహాయాదులన్నియు అందేకల్పింపబడినవి. మనదేశపు హోటలులన్నిటిలో నిదియసమానము. నలుబదియడుగులలోతునుండి బలమగు పునాదితోను అందుపైన ప్రశస్తమగు ఉక్కు కాంక్రిటుసిమెంటు మున్నగు చలించని వస్తువులతోను, సుందరముగ నిర్మితమైన యీభవనముకై జంషెడ్జి నలుబదిలక్షల రూపాయలు ఖర్చుచేసి, చాలశ్రమపడి ముఖ్యమగు నేర్పాటుల స్వయముగ జరిగించెను.

ఇట్లు బొంబాయినలకరించుటయే గాక, ఆనగరపు ఆరోగ్యము, విద్య, వ్యాయామము మున్నగు సౌకర్యముల వృద్ధికై, ఆయన ధనమునిచ్చితోడ్పడుచుండెను; విద్యాధికులు, వర్తకులు, సాంఘికరాజకీయనాయకులు, సాయంకాలములందు కలుసుకొని అనేకవిషయముల చర్చించుచు సంప్రతించుకొనుటకును, సామాన్యజనులకు గ్రంథాలయ సౌకర్యముండుటకును, ఆయన చాలచోట్ల క్లబ్బులస్థాపింప తోడ్పడెను; అందుల సంభాషణలలో పాల్గొనుచు, అందు తన విశేషానుభవముతో మిత్రులకనేక ముఖ్యవిషయములను తెలుపుచుండెను. ఆయన