పుట:2015.372412.Taataa-Charitramu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మువీడి పారి పోయిరి; వ్యాపారము స్తంభించెను, చాలమంది వ్యాపార నాయకులప్పుడు బొంబాయి విడచి చనిరి; అప్పుడు జంషెడ్జి మాత్రమందేయుండి ఆవ్యాధి నివారణకు, ఆరోగ్యవ్యాప్తికి, జరుపు చర్యలందు చాల తోడ్పడెను; అందుకు చాల ద్రవ్యసహాయము గూడ చేసెను.

బాల్యమునుండి తండ్రితో గలసి ఆనగరమందునే వేర్వేరు పేటలలో కాపుర ముండినందున, జంషెడ్జి యాపురమున చక్కని భవనముల నిర్మించుటకు వీలగుస్థలములను, జాగ్రత్తతో కనిపెట్టెను. వ్యాపార సందర్భమునను, తనబాకీసొమ్ముల తీర్మానముకును, ఆయన చాల నివేశస్థలములను క్రయముకు సంపాదించెను. వ్యాపారరంగములకు దగ్గరను ముందు వేగముగ వృద్ధికాదగిన ప్రాంతములందును గల ఖాళీస్థలములు ముందు చాల యుపయోగకరము లగునని గ్రహించి, ఆయన వానిని చౌకస్థితిలో కొనివేసెను; ఆస్థలములందు చక్కని సౌధముల నిర్మించెను.

ఇంగ్లండు ఫ్రాంసు జర్మనీలలోను, జపానులోను, ఆమెరికాలోను, గృహములను ఆరోగ్యకరముగ నిర్మించి, అందు చౌకలోనే స్నానపానదీపాదుల సౌకర్యములను, ఆధునిక వైజ్ఞానికపద్ధతుల ప్రకార మొనగూర్చుచున్నారు; వానిని తనవ్యాపారయాత్రలందు తాతా గమనించి, బొంబాయిలో నాప్రకార మిండ్లను కట్టెను. చుట్టును ఖాళీస్థలముంచి, బలమగు పునాది