పుట:2015.372412.Taataa-Charitramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డు ప్రేమచందురాయచందు అను కోటీశ్వరు డొక్కపెద్ద బాంకును స్థాపించెను అందలి సొమ్ముతో బొంబాయిచుట్టు నున్న విశాలమగు పల్లపు స్థలములో జొచ్చు సముద్రపుపోటు నీటిని పెద్దరాతిగోడలతో నరికట్టి, ఆస్థలముల మెరకజేసి, అందు వాసగృహముల నిర్మించుటకు తాతాయు మరికొందరును సమకట్టి కొంతపనిచేసిరి. అందుకు చాల సొమ్ముకావలెను. కాని అమెరికాలో సంధిచే యుద్ధము నిల్చిపోయి, మనదూది యెగుమతి హఠాత్తుగ ఆగినప్పుడు, బొంబాయిలో మరికొన్ని యితర బాంకులతో బాటు ప్రేమచందురాయచందుగారి బాంకును దివాలాతీసెను. ఆప్రళయమున చాలసొమ్ము నష్టమైనందున, ఆనివేశస్థలముల ప్రణాళికయు నిల్చిపోయెను.

నాగపురమం దెంప్రెసు మిల్లుల స్థాపించినప్పుడు, అచటి కూలీలకై జంషెడ్జి పాశ్చాత్యపురములందలి ఉత్తమరీతిని చక్కని కుటీరముల నిర్మించెను. దరిమిలాను బొంబాయిలోను అహమ్మదాబాదులోను మిల్లుల గట్టినప్పుడును, ఆయన యట్లే చేసెను. తనమిల్లుల నాయన విశాలముగను, పనివాండ్రకు సుకరముగ నుండునట్లును, కట్టెను. వారు వసించుటకై, విశాలమగు పేటలను తానే, చాలచొమ్ము ఖర్చుపరచి, నిర్మించెను.

................................................

  • * ఈయన గొప్ప వ్యాపారనాయకుడై, దూదియెగుమతిచే చాల శ్రీమంతుడై, అనేక దానధర్మములజేసెను. 'ఏషియాటిక్ బాంకింగ్ కార్పొరేషను' అను యీయన స్థాపించిన యాబాంకు దివాలాతీయగా, ఈయన స్థితిచెడెను.