పుట:2015.372412.Taataa-Charitramu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాతా వ్యాపార మారంభించుసరికి, ఆసంకులనగరము వికృత భవనములతో క్రిక్కిరిసి, జనసమ్మర్దముచే విశ్రాంతికి తావులేక, ఇరుకుసందులతో ననారోగ్యము కావాసమై యుండెను. మరియు మిల్లులు వృద్ధియైనకొలది, ఆప్రాంతములందు కార్మికులకై 'చాలు' లనబడు ఇరుకుకొ ట్లేర్పడెను. ఆపేటలు చాల క్రిక్కిరిసి తగువీధులు లేక గాలి వెలుతురులకు తావు లేనివై, నీటిసదుపాయము లేకయుండెను. దుర్భర దుర్గంధ భూయిష్టములైన యీ కొట్లలోని కూలిజనులు పశువులకన్న హీనముగ నుండిరి. తరుచు కుటుంబమంతయు, ఒక్కొకప్పుడు రెండుమూడు కుటుంబములుగూడ, ఒకే గదిలో భుజించుచు శయనించుచు, రాత్రింబవళ్లు నందే కాపురముండెను. అట్టిస్థితిలో, ఆపేటలం దంటువ్యాధు లారంభించి, తరుచు ప్రబలుచుండెను. ఆవ్యాధులు నగరమందలి యితరభాగములకును తీవ్రముగ వ్యాపించెను; వేలకొలది జను లావ్యాధులచే మరణించుచుండిరి. అందువలన బొంబాయి పురక్షేమముకు వ్యాపార వృద్ధికిని గూడ చాల హాని కలుగుచున్నదని, ఈకళంకమును మాన్పి నగరమును వాసయోగ్యముగ జేయుట ప్రథమకర్తవ్యమని, తాతాకు తోచెను.

1863 ప్రాంతమున దూదియెగుమతి చురుకుగ జరిగినపుడు, బొంబాయి వర్తకులకు చాల ద్రవ్యము చేరెను; అప్పు డాసొమ్ముతో చిత్రమగు కంపెనీలు చాల లేచెనుగదా? అప్పు