పుట:2015.372412.Taataa-Charitramu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందర్భమున మూడునాలుగేండ్లుమాత్ర మాయన నాగపురమందుండెను.) అప్పుడప్పుడు విదేశయాత్రలకు పోయినను కొన్ని నెలలకు బొంబాయి చేరుచుండెను. బొంబాయిపౌరుడగుటచే, జంషెడ్జి కానగరముపైన నమితాభిమానముండెను. ఆతని కాడంబరమన్నను వక్తృత్వమన్నను ఇష్టములేదు; ఎన్నడును మునిసిపలుసభ్యుడగుటకు యత్నింపలేదు; కాని పైకి తెలియకుండనే, బొంబాయి నగరపుఆరోగ్యమును విద్యాదిసౌకర్యములను హెచ్చించి, దానినిసుందరముగ జేయుటకాయన చాల కృషిచేసెను. (తనజన్మస్థలమగు నవసారిలోను ఆయన పాఠశాలలను భవనములను ఆరామములను నిర్మించెను.) బొంబాయియే మనదేశపు ప్రధానపురమని, అది ఆదర్శనగరము కావలెనని ఆయన ఆశయము.

జంషెడ్జితాతా ప్రవేశించునప్పటికి బొంబాయి యిప్పటి స్థితికి రాలేదు. అది సముద్రతీరపు ద్వీపపుంజము; మొదట


  • * బొంబాయిపుర మిప్పుడు కొన్ని విషయములలో మనదేశమం దసమానము, పదిలక్షలపైగా జనసంఖ్యగలది; కలకత్తా మాత్రము దీనికన్నను కొంచెము పెద్దదందురు. ఈరెండునగరములందును మనదేశమం దికెక్కడను లేని అనేక ప్రాసాదములు, మహాయంత్రశాలలు, వివిధపరిశ్రమలు, వివిధకళాశాలలు, వివిధజాతి జనసంఘములును, గలవు. కాని కలకత్తాలోని ముఖ్య పరిశ్రమలు చాలవరకు యూరపియనుల వశమందున్నవి. బొంబాయిలో అట్లుగాక పరిశ్రమలు వ్యాపారములు ముఖ్యముగా భారతీయహస్తములందే యున్నవి. అందువల్ల కలకత్తాలో యున్నంత పాశ్చాత్యప్రాబల్యము బొంబాయిలో లేదు. మన దేశీయవ్యాపారములకు బొంబాయియే కేంద్రమని చెప్పవచ్చును.