పుట:2015.372412.Taataa-Charitramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. పౌరసేవ.

ఇతరజీవులవలె గాక నరుడు, విశేషముగ సాంఘికుడు; అనగా సంఘములో నొకభాగమై, దానివలన చాల సహాయము బొందుచుండును. చాలవరకు సంఘక్షేమమే అందలి వ్యక్తుల క్షేమమగును. అందువలన తాను సంఘమునకు వీలైనంతవరకు సాయముచేయుట ప్రతినరుని ధర్మము. ఆసాయము దేశమంతకు వ్యాపించిన, అది దేశసేవ యనిపించుకొనును. అట్టిసందర్భముకొలది మందికే కల్గును; కాని ప్రతివాడును తాను కాపురముండు గ్రామమునకో పురముకో ఉపకరింపవచ్చును. పెద్దనగరములం దుండువారు తమ నగరవృద్ధికై యధాశక్తిగ పనిచేయుటకు మంచి యవకాశము లుండును. ఇదియే పౌరసేవ యనిపించుకొనును. (ఈపౌరసేవయే దేశ సేవకు పునాదికావచ్చును. ఆయావ్యక్తి ప్రవృత్తిని బట్టి ఇది వేరువేరు రూపము దాల్చవచ్చును.)

13 వ యేట విద్యారంభముకై జంషెడ్జి బొంబాయి వచ్చి, అప్పటినుండి యందే వసించెను; (మధ్య ఎంప్రెసుమిల్లు

  • * ఆధ్యాత్మికముగ గూడ కేవల వ్యక్తి మోక్షమునే యపేక్షించి, కేవల జ్ఞానియై నిష్క్రియుడగుటకన్న, ఈశ్వరప్రీతికరముగ, ఈశ్వరసృష్టిలో ఆయాజీవులు గూడ తనవలె బంధమోక్షము నొందగోరుచు, అందుకై చేతనైనంతవరకు సంఘ క్షేమకరమగు కర్మలజేయుటయే నిశ్శ్రేయసమని చాలమంది మతస్థాపకు లెంచినటుల తోచును.