పుట:2015.372412.Taataa-Charitramu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమల రక్షణ కాపన్ను అవసరముకాదు. ఇట్లీసంగతులన్నిటిని లండనులో భారతమంత్రియగు హమిల్టనుప్రభువుకు తాతా సవిమర్శముగ వివరించెను.

అంతయువిని హమిల్టనుప్రభువు భారతదేశపు మిల్లులకు హెచ్చులాభము వచ్చుచున్నదని, అందుచే నీపన్నువలన బొంబాయిమిల్లులకు బాధయుండదని, జవాబుచెప్పిరి. సగటున నూటికారుకన్న హెచ్చులాభము లేదని, చాలమిల్లుల కంతవరకుగూడ లాభములేక నష్టముకూడ పొందుచున్నవని, తాతా జవాబునిచ్చెను; ఆసంగతికి నిదర్శనము కావలెనని భారతమంత్రి కోరగా, తాతాగారట్లేయని మనదేశముకు వెంటనే తిరిగివచ్చి, 1897 లో మనదేశపు మిల్లులన్నిటి జమాఖర్చులను సరిగా తేల్పించి, వానినుండి నిరాక్షేపణగ లెక్కల తయారుచేసెను; వానిని తానే యచ్చువేయించి, ఆంగ్లమంత్రులకును ఇతరప్రముఖులకును పంపెను. మన మిల్లులలో చాలవానికి లాభమతి స్వల్పమని, కొన్ని కేవల దుర్దశలోనున్నవని, ఆలెక్కలచే స్పష్టమయ్యెను; కాని యెట్లైన నాపన్నురద్దుచేయుట కాంగ్లపారిశ్రామికులు, అచటి ప్రభుత్వమును, ఒప్పుకొనలేదు. అప్పుడు పోటీ లేకున్నను, ముందైనను భారతదేశపు మిల్లులు బాగుగ వేద్ధియైనంతట, తమమిల్లు సరుకుల దిగుమతి తగ్గునేమో యని వారిభయము. ఇట్లు మనప్రతినిధిగ తాతా చేసిన వాద మరణ్య