పుట:2015.372412.Taataa-Charitramu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశ్రమలకు ద్రవ్యముకు వ్యాపారసౌఖ్యములకును ఆలవాలమైనది. అచటి మిల్లులకుదగ్గరనే చౌకయగునేల బొగ్గును కలదు. భారతదేశపు మిల్లుపరిశ్రమకో ప్రభుత్వసహాయ మెన్నడును లేదు. కార్మికులకు తగు జ్ఞానము, ప్రజ్ఞ, శక్తి, ఓర్పు, లేవు; యంత్రములను విదేశములనుండి హెచ్చుధరకు రప్పింపవలెను; వ్యాపారులకు పెద్దపరిశ్రమలకై తగినంత మూలధనము లేదు.*[1] బొంబాయిమున్నగు మిల్లుస్థలముల సమీపమున నేలబొగ్గుగనులు లేవు. మరియు సాధారణముగ, ఇచటిమిల్లుయంత్రములు ముదుకనూలునే తీయగలవు. ఈస్థితిలో, ఈమిల్లులకు బ్రిటిషు మిల్లులకు నిజమగు పోటీయుండదు. ముదుకబట్టలవేయు చీనా జపానుల మిల్లులతో మాత్రము భారతదేశపు మిల్లులకు పోటీ యుండును. జపానుప్రభుత్వము తమదేశపు మిల్లులకు చాల సాయముచేయును; ఆమిల్లుల కనేక సదుపాయములును కలవు. కనుక భారతదేశపు నూలుపై వేసిన పన్ను ఈదేశీయులకు నష్టకరము; జపానీయులకు లాభకరము నగును.†[2] బ్రిటిషుపరి

  1. * పాశ్చాత్యదేశములందు గొప్ప భూస్వాములు ఉద్యోగులు తమ నిలవసొమ్మును యంత్రపరిశ్రమల పెట్టుబడికి వినియోగింతురు. మనజమీందారులు సంస్థానాధిపులు, గొప్ప ఉద్యోగులు, సాధారణముగా అట్లు చేయక, తరుచు వ్యర్ధముగనే ఖర్చుచేయుదురు.
  2. † ఈపన్ను భరించి మన మిల్లుబట్టలు చీనా కెగుమతియై, అచట హెచ్చుధర కమ్మవలసివచ్చెను. జపానుసరుకులు ప్రత్యేకనౌకలపైన ప్రభుత్వ సహాయమున పోటీగ తక్కువ కిమ్మతు కమ్ముచుండెను. అందువలనను, మనదేశజనులకును గూడ, ఈపన్నుచే నష్టమే కలిగెను. క్రమముగ జపానుబట్టలు వ్యాపించెను.