పుట:2015.372412.Taataa-Charitramu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లును; బ్రిటనులోవలె గాక, ఈదేశపు మిల్లువ్యాపార మింకను బాల్యదశలో నుండెను. దానికి చాల కష్టములుగలవు. ఈపన్ను అన్యాయమని విశదముచేయుటకు మిల్లుయజమానిసంఘము తరపున జంషెడ్జితాతా ఎన్ వాడియాగార్లు ప్రతినిధులుగ వెళ్ళిరి. వా రాసందర్భములను భారతప్రభుత్వపు ఉద్యోగులకు చక్కగ నివేదించిరి. కాని ఆప్రభుత్వమువా రందలినిజమును గ్రహించినను; తాము బ్రిటిషుప్రభుత్వము కధీనులగుటచే నేమియు చేయలేమని తెల్పిరి. భారతప్రభుత్వమువా రీదేశపు ప్రతినిధుల యొక్కయు, ఇచటి శాసనసభలయొక్కయు, తీర్మానము నంగీకరించు బాధ్యతలేదు. కాని బ్రిటిషుప్రభుత్వపు ఆజ్ఞల నిరాకరించుటకు వారికధికారము లేదు.

ఈపరాధీనస్థితి తెలిసి, తాతా ఆంగ్లదేశము పోయి, అచట భారతమంత్రితో నీవిషయమును తీవ్రముగ చర్చించెను. అచట మిల్లునూలుపైన బట్టలపైన పన్ను లేదు; పైగా, ఇదివరలో ఆమిల్లులకు బ్రిటిషుప్రభుత్వము చాలరీతుల సాయము చేసియుండెను. అచటి కార్మికులు, నాయకులు గూడ, అప్పటి కావ్యాపారమం దారితేరి గొప్ప నిపుణులైరి. వారు శ్రీమంతులు, అందరును విద్యావంతులు; అవసరమగు విజ్ఞానమును నేర్పు పాఠశాలలు, యంత్రశాలలు, అచ్చట చాలగలవు. ఆదేశ ముష్ణముకాదు; అచటిజనులు చాల దృఢగాత్రులు, ఓర్పుతో నెక్కువపని చేయగలరు. ఆంగ్లదేశము క్రమముగ అన్ని యంత్ర