పుట:2015.372412.Taataa-Charitramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనదేశపు దిగుమతులన్నిటిలో సగముకన్న హెచ్చుకిమ్మతు వగుటచే, వాని మినహాయింపువలన తిరుగ మనప్రభుత్వపు ఆదాయము చాల తగ్గి, ఆర్ధికబాధ కల్గెను. ఈసంగతినంతను మనవిచేసి నూటికి 3 1/2 వంతున తగ్గింపు రేటుగనైనను వానిపై గూడ పన్ను విధింపనిండని, మనప్రభుత్వమువారు తమ కధికారులైన బ్రిటిషుప్రభుత్వమును కోరిరి. అంత రేటు పన్నును భారతదేశపుమిల్లులలో తయారగు నూలుపైన బట్టలపైనగూడ విధింపవలెనని, అట్లైననే దిగుమతియగు సీమనూలు బట్టలపైనను పన్నువిధింపవచ్చునని, బ్రిటిషుప్రభుత్వమువారు తెల్పిరి. అంతట బ్రిటిషునూలుపై విధించురేటున 3 1/2 చొప్పున, మన మిల్లులలో తయారగు నె 20 రుకు పైబడిననూలు అంతటిపైన (బట్టలపైనను) వెంటనే మన ప్రభుత్వమువారు పన్ను విధించి, వసూలుచేసిరి. బ్రిటిషు మిల్లునూలు 60 న నెంబరుకు పైబడి చాల సన్నగనుండును. దానికి మన ముదుకు నూలుతో పోటీ యుండదు. అందుచే కేవలము ముదుకయగు నె 20 రు లోపునూలుకు మాత్ర మాపన్ను అక్కరలేకుండ బ్రిటిషుప్రభుత్వము సమ్మతించెను.

ఈదేశపు సరుకులపై నీపన్ను వేయుటచే నప్పుడాందోళనకలిగెను. అమ్మకమై సీమనుండి దిగుమతియగు సరుకుపై పన్ను విధించినందుకుగాను, మనమిల్లుసరుకుల కమ్మకము లేకున్నను మిల్లులో నుత్పత్తికాగనే మన సరుకులకును పన్ను తగు