పుట:2015.372412.Taataa-Charitramu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్న విశేషలాభము తగ్గునేమో యని, బ్రిటిషు వ్యాపారులు భీతిల్లిరి. మన ప్రభుత్వము బ్రిటిషునూలుపైన బట్టలపైన పన్ను విధింపకూడదని, వారు ఇంగ్లండులో పెద్ద ఆందోళన నారంభించిరి. లంకషైరులోని బ్రిటిషు మిల్లువ్యాపారము అచట లక్షలకొలది జనులకు లాభకరముగ ఉన్నది; మరియు, అది యచటి యితరపరిశ్రమలకును చాలసహకారి. ఆపారిశ్రామికులును వారి చెప్పుచేతలలో నుండు పార్లమెంటు సభ్యులును ఇంగ్లండులో ప్రభుత్వమును ఒత్తిడిచేసిరి. వారంతట మనదేశపు ప్రభుత్వమును ఈదిగుమతి సుంకమును తొలగింప నిర్భంధించిరి. (ఇప్పటి రాజ్యాంగవిధానమునుబట్టి మన భారతప్రభుత్వము లండనులో నున్న భారతమంత్రి కెప్పుడును లోబడియుండును. ఆమంత్రి బ్రిటిషుమంత్రివర్గములోనివాడు; ఆయన బ్రిటిషుపార్లమెంటువారి యిష్టప్రకారమే నడుచుకొనవలెను. లేనిచో వా రతనిని, మనదేశములో గవర్నరుజనరలు మున్నగు పెద్ద ఉద్యోగులను గూడ, మార్పించగల్గుదురు; వారిజీతములగూడ తగ్గింపగల్గుదురు. మనప్రభుత్వము మనప్రజల కెంతమాత్రము బాధ్యులు కారు. వా రింగ్లండులోని బ్రిటిషుపార్ల మెంటుకే జబాబుదారులు.) బ్రిటిషుప్రభుత్వమువారు చేసిన యాయొత్తిడివలన మన ప్రభుత్వమువారు తా మిదివరలో హర్షల్‌కమిటీ సలహాప్రకారము విధించిన దిగుమతిపన్నులను బ్రిటనునుండి వచ్చు నూలుపైనను, బట్టలపైనను రద్దుచేయవలసి వచ్చెను. కాని ఆసరుకులే