పుట:2015.372412.Taataa-Charitramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలసకేగియున్నారు. ఆరంభదశలోమాత్రము ప్రోత్సాహముకై ప్రభుత్వ సహాయమును, కలసి తగువసతుల నేర్పర్చుటకై మిల్లు యజమాని సంఘపు సహాయమును, అవసరమని మిల్లుదార్ల సంఘముకును ప్రభుత్వముకును తాతాగారు తెల్పి, వారి సహాయము కోరిరి. తాతా సలహాప్రకారము వారు జరిగించి యుండినచో, అప్పుడు వేలకొలది యుక్తప్రాంతీయులు బొంబాయి ప్రాంతమున పనివాండ్రుగా వలసవచ్చియుందురు. అందుచే యుక్తప్రాంతమున కొంచము జనసమ్మర్దము తగ్గి, ఆప్రాంతములకును బొంబాయి మిల్లులకును గూడ లాభముకల్గియుండును. తాతా తనదీర్ఘ లేఖలో నాసమస్య నంతను విపులముగ చర్చించి, అట్లువలసవచ్చుటచే గల్గుఫలితములను విశదపర్చెను; కాని తాతాగారి దూరదృష్టి తక్కిన మిల్లుదార్లకు కలుగలేదు. ప్రభుత్వసహాయము కోరుడని, వసతికై తగుకట్టుబాట్లచేయుడని, తాతాసూచించినను, మిల్లు యజమాని సంఘమప్పుడు శ్రద్ధవహింపలేదు. కార్మీకసమస్య కాలక్రమమున తనంతటనే పరిష్కారమగుచుండునని, అందుకు ప్రత్యేకప్రయత్న మక్కరలేదనియు, వారు తాతాగారి లేఖకు జవాబునిచ్చిరి. ఇట్లాసంఘము అశ్రద్ధతోనుండుటచే, ప్రభుత్వమునుపేక్షించెను; ఒక్క తాతాగారి కోరికపైననే అట్టి యుద్యమముకు పూనుట ప్రభుత్వము కిష్టముకాలేదు.