పుట:2015.372412.Taataa-Charitramu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంగా యమునా పునీతమగు యుక్తప్రాంతమున జనసమ్మర్ద మధికము. అచటికూలి రోజుకొకయణా యుండెను; చాలమంది కావృత్తియు లేదు. తరుచు అచట కరువుండెను. తాతా తన దృష్టినటు మరల్చెను. వృత్తిలేక యల్లాడు యుక్తప్రాంతీయులలో గొందరిని బొంబాయి ప్రాంతమునకు జేర్చినచో, వారికీమిల్లులందు రోజు కారణాలు కూలి లభించును; మిల్లుపనికి వలయునంత మంది కూలీలు నేర్పడుదురు. కాని వారు నిరాధారులైనను స్వగ్రామముల వదలి భిన్నభాషికము దూరస్థము నగు బొంబాయికి తమంతట రా నిచ్చయింపరైరి. కొత్తస్థలమున పరిస్థితు లెట్లుండునో, వృత్తి సరిగా జరుగునో లేదో యని యాయజ్ఞానులు భీతులైరి. వారి పిరికితనము పోగొట్టి ధైర్యోత్సాహములు కల్గింపవలసి యుండెను. ఇట్టిస్థితిలో ప్రభుత్వమువారును పరిశ్రమల యజమూనులును ముందుగా కొందరిని రప్పించి, వారికి తగు వసతిని మంచి జీతమును ఇప్పించెదమని ప్రోత్సహించినచో, ఆవిశ్వాసమున వారు వలసకు వత్తురు. అట్టి ప్రోత్సాహముచే, చాలప్రాంతముల జనులు విదేశములకును పోవుచున్నారు. ముందుగా వెళ్ళిన కొందరు ద్రవ్యము సంపాదించి, అచ్చటస్థితి సుఖకరముగను లాభదాయిగను ఉన్నదని తిరిగివచ్చినప్పుడు తమ గ్రామములవారికి తెల్పినమీదట, ఆగ్రామములజను లీసారి తమంతటనే బయలుదేరి వెళ్ళుదురు. ఇట్లు కలకత్తా జనపనారమిల్లులకు, అస్సాంటీతోటలకు, బర్మా, ఫిజి, నేటాలు మున్నగు విదేశప్రాంతములకు గూడ, మనజనులు