పుట:2015.372412.Taataa-Charitramu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పారము విశేషద్రవ్యసాధ్యము. మనకు ప్రభుత్వసహాయమును లేదయ్యెను. అందుచే వ్యాపార జయముకై తాతా అప్పటి జపాను నౌకాసంఘముతో కలసి నౌకల నడుపదలచెను. అట్లు గానిచో ప్రబలప్రత్యర్ధులగు యూరపియను నౌకాసంఘముతో పోటీచేయుట అసంభవము. ఈవ్యాపారము జయప్రదమగుటకు, బొంబాయి వ్యాపారులు తమ మిల్లు సరుకులను ఆనౌకల పైననే న్యాయమైన కేవుకు పంపుటయు, యూరపియనులు పోటీ పడగొట్టుటకై కేవుల తగ్గించి ఆకర్షించినను, వీరు చలించకుండుటయు, ముఖ్యావసరము. అట్లీయోడలపైననే రెండెండ్లవరకు తమ సరుకుల బంపుటకు బొంబాయి వ్యాపారులు తాతా కొడంబడిక నిచ్చిరి. ఆప్రకారము తాతాయు జపాను నౌకాసంఘముకు ఖరారుచేసెను. బొంబాయినుండి నూలును బట్టలు మున్నగు సరుకులను ఈనౌకలు చీనాజపానులకు గొనిపోయి, అందుండి మరలి వచ్చునప్పుడు అగ్గిపెట్టెలను, అద్దములు, నేలబొగ్గు మున్నగువానిని, తెచ్చుచు; అందుచే, ఉభయులవ్యాపారమును వృద్ధియగును. యూరపియనులు ముందుగానే విఘ్నము కల్గింపకుండుటకై, ఈయేర్పాటులన్నియు జాగ్రత్తతో గూఢముగ జేయబడెను.

ఇట్లంతయు పూర్తియై, 1893 లో, ఆనౌకలు బొంబాయి రేవునుండి నూలును, బట్టలనుకొనిపోదొడగెను. కెవు నెంతహెచ్చించినను బొంబాయినుండి సరుకుల గొనిపోవుటకు తామే