పుట:2015.372412.Taataa-Charitramu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనదేశమున విజ్ఞానవ్యాప్తి లేక, ఆసౌకర్యము లేకుండెను. ఆధునిక నౌకల నిర్మాణమునకు కోట్లకొలది రూపాయల పెట్టుబడి కావలెను; మన వ్యాపారుల కట్టి పెట్టుబడియు లేదు. క్రమముగ విదేశనౌకల పోటీ ధాటికి నిలువలేక, మనకోస్తా నౌకలు రంగస్థలమునుండి తొలగి మూలబడెను; ఇట్లీదేశపు నౌకానిర్మాణము క్షీణించిపోయెను.

మిల్లుసరుకులు మున్నగువానిని ఆయాదేశములం దమ్మబోవుటలో విదేశీయులకును భారతీయులకును పోటీ హెచ్చుచున్నది. పాశ్చాత్యులును మనవారును తమతమ సరుకులను చీనాజపానులం దమ్ముట కెగుమతిచేయుచుండిరి; అచట తమ తమ సరుకులను చౌకగ విక్రయింప యత్నించిరి. ఇట్లాదేశములందు కొంత పోటీ కల్గినది. ఇట్లుండ, మనతో పోటీపడు పాశ్చాత్యుల వశమందలి విదేశీయనౌకలే మనదేశపు సరుకుల యెగుమతి కాధారమగుటవలన బాధలు కలుగ నారంభించెను; స్వదేశవ్యాపారము సముద్రముపైన మనచుట్టుపట్ల దేశములతో ప్రాచ్యనౌకలపైననే జరుపవలెనని తాతా గ్రహించెను. ఆరంభమున నౌకావ్యాపారములో కొంతనష్టము కలుగునని జంషెడ్జి యెరుగును, కాని ఆత్యాగమున కాయనసిద్ధపడెను. ఆయన అద్దెషరతుపైన యూరపునుండి రెండు పెద్దనౌకల సంపాదించెను. అప్పుడు జపానీయులు తమప్రభుత్వపు సాహాయ్యమున మంచి నౌకల నిర్మించి నడుపుచుండిరి. ఈవ్యా