పుట:2015.372412.Taataa-Charitramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డుట యవసరమని కనిపెట్టి, అందుకై తీవ్ర యత్నము చేసెను. అందు దేశీయనౌకల జేర్చుటకును ఆయన తలపెట్టెను.

పూర్వము మనదేశపు వివిధవస్తువులు అప్పటి నాగరిక దేశములన్నిటికిని హిమాలయపు కనుమలగుండ మెట్టదారిని, సముద్రముపై నోడలమీదనుగూడ, ఎగుమతి యగుచుండెను. కొందరు భారతీయు లప్పుడావిదేశములకు జని, అందు విజ్ఞానమును వ్యాపారమును వ్యాపింపజేసిరి. ఈరాకపోకలు, ఎగుమతి, చాలవరకు మనదేశపు నౌకలపైననే జరుగుచుండెను. మనతీరములందు తామ్రలిప్తి, కురంగపురము (కోరంగి) భారుకచ్ఛము (బ్రోచి) మున్నగు పురముల రేవులయొద్ద గొప్పనౌకలు నిర్మితము లగుచుండెను. ఇప్పటికి సుమారు నూరేండ్లక్రిందటి వరకును మన దేశపుఓడలు దేశాంతరములకు కోస్తావ్యాపారము జరిగించుచునే ఉండెను. నూరేండ్లక్రింద బొంబాయి రేవులోకట్టిన కొన్నియోడలు యూరపుకు గొంపోబడి, అచటి సముద్రములందు బ్రిటిషు యుద్ధనౌకలకన్నను వన్నెగా పని చేసెను. కాని తరువాత పరిస్థితులు మారెను. మననౌకలకు ప్రభుత్వాదరణ పోయెను. పాశ్చాత్యదేశముల ప్రభుత్వములు అచట మంచినౌకల నిర్మించుటకు విశేషప్రోత్సాహ మొసగిరి. ఆదేశముల వ్యాపారము వృద్ధియయ్యెను. అచటి విజ్ఞానమును వృద్ధియై, అందుమూలమున పాశ్చాత్యులు క్రమముగ ఇనుముతోను ఆవిరియంత్రములతోను మహానౌకల నిర్మింపగలిగిరి.