పుట:2015.372412.Taataa-Charitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. నౌకావ్యాపారము.

మనదేశపు మిల్లులం దిదివరలో ముదుకబట్టలే తయారగుచుండెను. వానిలో కొన్నిమాత్ర మిచట ఖర్చు అయినను, చాలభాగము చీనా జపాను పారసీకము తూర్పుఆఫ్రికామున్నగు విదేశములందే అమ్ముచుండెను. (అప్పటికింకను జపానులో మిల్లు లేర్పడలేదు; ఆపోటీబాధ తగుల లేదు.) బొంబాయి ప్రాంతములనుండి ఆదేశములన్నిటికిని స్టీమరులపైననే సరుకుల బంపవలెను. మనదేశమునుండి అప్పు డాదేశములకు బ్రిటిషు వారి పి. అండ్ ఓ. కంపెనీయు, ఇటలీ ఆస్ట్రియాల మరిరెండు కంపెనీలునే, ఓడలనడుపుచుండెను. ఈకంపెనీలమధ్య పోటీ యున్నంతకాలము కేవుల రేట్లు న్యాయముగనే యుండెను. కాని యాసరుకుల యెగుమతికి తామే యాధారమగుట గాంచి, ఈ మూడు యూరపియనుసంఘములు నేకీభవించి, కేవులను చాల హెచ్చించిరి. అందువలన మన మిల్లుదార్ల లాభపుద్రవ్యమంతయు కేవులరూపమున హరించి, నౌకాసంఘములకు పోవుచుండెను. కష్టపడి వ్యాపారముచేయు బొంబాయిమిల్లు వర్తకులకు గిట్టుబాటే లేకుండెను; కాని వారు చేయునది లేక యట్లే సరుకుల బంపవలసివచ్చెను. ఈవర్తకులలో నొకరగు జంషెడ్జి తాతా ఆయూరపియను కంపెనీల యన్యాయచర్యలకు ప్రతిక్రియ చేయదలంచెను; న్యాయమైనరేటుకే బొంబాయినుండి చీనాజపానులకు సరుకులగొనిపోగల మరియొకసంఘ మేర్ప