పుట:2015.372412.Taataa-Charitramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎలెక్ట్రికు దీపములబెట్టి, ఆమిల్లులను అవసరమైనప్పుడు రాత్రులందును నడిపి, చాల హెచ్చుసరుకుల దయారుచేసెను. తరువాత దానినిజూచి, ఇటీవల తక్కిన మిల్లుదార్లును కొంద రా పద్ధతి నవలంబించిరి.*[1]

_________
  1. * విద్యుచ్ఛక్తి కాంతినిచ్చుటకే గాక, పంకాతో గాలి విసురుటకు, ఆవిరికిబదులుగ ఇంజను నడపుటకును గూడ, ఉపయోగించును. నాగపుర ప్రాంతమున జలపాతములేదు. అచట ఆవిరిమూలముననే తాతావారు విద్యుచ్ఛక్తిని పుట్టించి, దానితోనే కొంతవరకు మిల్లులగూడ నడుపుదురు. కనుమల నుండి జలపాతముతో తాతావారే తరువాత విద్యుచ్ఛక్తిని జనింపజేసిరి. దానితో నిప్పుడు బొంబాయిలో మిల్లుల నడుపుచున్నారు.