పుట:2015.372412.Taataa-Charitramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నికరపులాభముపైననే ఆయనకమిషనును, మితముగ, తీసుకొను చుండెను. అందువలన తాతాగారి యాజమాన్యమన్న జనులకు వాటాదార్లకుగూడ హెచ్చు నమ్మిక, గౌరవము, ఏర్పడెను. ఇట్లాయన స్వార్థపరతలేకుండ, వ్యాపారవృద్ధినే ప్రధానముగ చేసికొనెను; ఈపద్ధతిచే మొదట కొన్ని యేండ్లాయనకు నష్టము కల్గెను; కాని క్రమముగా, ఆయనమిల్లులు ప్రసిద్ధమై చాల వృద్ధియై, ఆయనకు తుద కందుండి చాల లాభమే కల్గెను.

తనమిల్లులందు తాతా యవలంబించిన యింకొక కొత్త పద్ధతి రాత్రులందును మిల్లు పని జరుపుట; తక్కిన ఫాక్టరీలవలె గాక, దూదిమిల్లుల కగ్నిస్పర్శయైనచో, అపారనష్టము కల్గును. రాత్రులందు మామూలుదీపముల నుంచుటచే, నిప్పు దూదికిని ఆ సరుకులకును తగులవచ్చును. ఈభయమున హెచ్చుపనిగల సమయములందును బొంబాయిమిల్లుదార్లు రాత్రులందు తమ యంత్రముల తెరువరైరి. ఆంగ్లదేశమందు 'ఎలక్ట్రికు' (విద్యుత్) దీపములతో రాత్రులందును మిల్లుల బనిచేయ దొడగిరి.

ఆపద్ధతిని స్వయముగ జూచి, ఈరీతిగ రాత్రులందును మిల్లులను భద్రముగ నడుపవచ్చునని మనదేశమున తాతాయే మొదట కనిపెట్టెను. అప్పటి కింకను మనదేశమున విద్యుద్దీపముల వ్యాప్తి లేకుండెను. కాని ఆసౌకర్యలాభమును ఇంగ్లండులో గమనించిన తాతా తన ఎంప్రెస్సుమిల్లులందు ముందుగా