పుట:2015.372412.Taataa-Charitramu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమదేశమందే నిల్పుకొనగల్గిరి. ఆపరిశ్రమ లేర్పడుటవలన జపానీయుల యార్థికస్థితి చాల బాగుపడి, ఆజనుల సంపద వృద్ధి యాయెను. జపాను వ్యాపారులిట్లు క్రమముగా తమమిల్లులను వృద్ధిజేసి, ఇకముందు చీనాకును బట్టల నెగుమతిచేయ దొడగిరి.

అప్పటి జపాను చక్రవర్తియగు 'ముత్సోహితో' ప్రజాక్షేమముకొర కాదేశపు పరిశ్రమల యభివృద్ధికై చాలకృషిచేసెను. శీతలము గిరిమయము నగు జపానులో ప్రత్తి పండదు. ఆ ప్రభుత్వమాధునిక పద్ధతివగు మంచి నౌకల గొనియు, నిర్మించియు, తమనౌకాబలము వృద్ధిజేసెను; జపానీయ వ్యాపారనౌకలకు సాయముచేసెను. ఈనౌక లమెరికానుండియు మనదేశమునుండియు దూదిని చౌకగ తేగా, మిల్లుదా ర్లాదూదితో జపానులో బట్టల దయారుచేసుకొందురు; అట్టినౌకలను వారు చీనాకును పంపదొడగిరి. మనదేశపుమిల్లుల కట్టి ప్రభుత్వ సహాయము లేదు.†[1] జపానునౌకలవలెగాక, మనకు స్వంతమగు నౌకలు లేవు; పోటీ లేక మనసరకుల గొనిపోవు బ్రిటిషు నౌకలవారు బొంబాయివర్తకులనుండి యెగుమతికి చాల హెచ్చురేటు కేవును వసూలుచేయుచుండిరి. జపానులో, ఆవిరియంత్రములకు వలయు నేలబొగ్గు చౌకగ నామిల్లులదగ్గరనే దొరకును. బొంబాయిప్రాంతమం దట్టిగనులు లేవు. దూరపుగనులనుండి రైలుపై తెచ్చుబొగ్గుకు రైలుకంపెనీలు చాల హెచ్చురేటు బాడుగ వసూలుచేయుదు

  1. † మనదేశపు సన్ననూలుపై నిచ్చటనే పన్నుగూడ విధింపబడెను.