పుట:2015.372412.Taataa-Charitramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈరీతి నాయువకుల ద్వారా తాతాగారి పద్ధతులు కొంతవరకు నితరులమిల్లులకును వ్యాపించెను; వానిలో క్రమాభివృద్ధికల్గెను. తాతా దేశక్షేమమే ముఖ్యముగనెంచెను, కాని స్వలాభము ప్రధానమని యెంచనందున, వ్యాపారమర్మములను రహస్యముగనుంచక, తోటిమిల్లుదారులకును ధారాళముగ దెల్పుచుండెను. ఇట్లన్నివిధములను ఎంప్రెసుమిల్లులు వృద్ధిజెంది, జనాకర్షకమై మార్గదర్శకమయ్యెను. లాభకరమగు కొత్తపద్ధతులు మొదట ఎంప్రెసుమిల్లులో ప్రవేశమై, తరువాత కొంత వరకితరమిల్లులకుప్రాకి, వానికిని ఉపయోగించెను.

తాతా సాహసముతో చేయుప్రయత్నములలో కొన్ని మొదట విఫలమైనను, అంతటితో నిరాశుడుగాక, అనుభవమును బట్టి లోపముల సవరించి, అవసరమగు మార్పులజేసి, ఆయన తుదకు జయమొందుచుండెను. ఇట్లు 12 ఏండ్ల నిరంతర పరిశ్రమతో తాతా యామిల్లుల నాదర్శప్రాయముగ జేసెను; అంతటినుండి దాదాభాయియు నితరోద్యోగులునే ఆమిల్లుల నట్లు చక్కగ నడుపజొచ్చిరి; తాతా అందులకిక శ్రమపడలేదు. ఆయనతల పెట్టిన తక్కిన ఉద్యమములకుగూడ దాదాభాయి కుడిభుజముగ నుండి, సాయము చేయుచుండెను.

చక్కని పద్ధతులపై నడపుటచే, ఈకంపెనీకార్ధికముగను జయముకల్గెను. 30 ఏండ్లలో మూలధనముకు 13 రెట్లసొమ్ము లాభించెను. అందుకొంత కొత్తరకపు యంత్రములకై ఖర్చుఅయి,