పుట:2015.372412.Taataa-Charitramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాతా అంతట నాయంత్రస్థాపనకై స్థలపరిశోధన గావించెను. ఇంతవర కందరును గతానుగతికముగ బొంబాయిలోనే మిల్లుల బెట్టుచుండిరి. అందుచే వారిలో పోటీ, పనివాండ్రగిరాకి, ప్రత్తిధర హెచ్చుటయు, కల్గెను. మరియు యింజనులకు వలయుబొగ్గు, కలప, బొంబాయివద్ద లేవు; దూరమునుండి తెప్పించుటకు రైలుఛార్జి చాల తగులును. ఆమిల్లులందు తయారగుబట్టలను దూరప్రాంతములకు చేర్చవలసియుండి, అందుకు హెచ్చు వ్యయప్రయాసములు కల్గును. ఈసంగతుల గమనించి, బొంబాయివాసియైనను తాతా తన సౌకర్యమునే చూచుకొనక, దూరదృష్టితో తన మిల్లును మనదేశపుమధ్యనున్న మధ్యరాష్ట్రపు రాజధానియగు నాగపురమునొద్ద స్థాపించెను. అది ప్రత్తి పండు జిల్లాలమధ్య నున్నది; కలపగల యడవులు నేలబొగ్గును దానికి చేరువ; చుట్టుపట్ల జనపదములం దా మిల్లుసరకుల పోటీలేకుండ, అమ్మవచ్చును. ఆప్రాంతమం దెచ్చటను అప్పటికి బట్టలమిల్లే లేదు. దానిని 1877 ఆరంభమున స్థాపించి, 'ఎంప్రెస్‌మిల్లు' అని పేరిడిరి.*[1] బొంబాయి మిల్లుబట్టలకన్న, ఈయెంప్రెసుమిల్లుబట్టల చాల సన్ననివి, మెత్తవి, మన్నికగలవియై, చాల చౌకగగూడ నుండెను; అవి దేశమంతటను

  1. * మన 8 వ ఎడ్వర్డు రాజుకు ప్రపితామహి అప్పటిరాణిఅగు విక్టోరియా 1-1-1877 తేదీని మనదేశపు 'ఎంప్రెస్‌'(=చక్రవర్తిని) బిరుదువహించెను. ఆతేదీనే ఈమిల్లునేర్పర్చిరి.