పుట:2015.372412.Taataa-Charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డిరి. గ్రామములందు వీరును ఇతరజనులు చాలమందియు నిరుద్యోగులు, నిరాహారులు, అయిరి. విదేశపుబట్టల దూదియు తరుచు విదేశపుదే; కనుక మనప్రత్తికిని ఖర్చుతగ్గి, ధరలేక, మన ప్రత్తిసాగుకును చాల నష్టము కలిగినది. 19 వ శతాబ్దిమధ్యకు, ఇట్లు మన యార్థికస్థితి విషమించెను. విదేశములకు ధనప్రవాహము పోకుండ అరికట్టినగాని అ నీరసస్థితి పోదని, అందుచే జనులకు రుచించు మంచి మిల్లుబట్టలనే మనదేశమున తయారుచేయ వలెనని, మనదేశపుపరిశ్రమలరక్షణ కదియే మార్గమని, ఆపరిస్థితిలో చేతినూలు మిల్లునూలుతో పోటీచేయలేదని, జంషెడ్జి తాతాకు తోచెను.

మనదేశపు మొదటి బట్టలమిల్లు 1855 ప్రాంతమున బొంబాయియం దేర్పడెను. అది కేవలము ముదుకనూలు మిల్లు; దానిని జూచి కొంద రింగ్లండునుండి యట్టి యంత్రములనే తెప్పించి, బొంబాయి ప్రాంతమదే మిల్లుల నెలకొల్పిరి. అం దా ప్రాంతపు దూదితో ముదుకబట్టలు దయారగుచుండెను. (అమెరికా యుద్ధపు నాలుగేండ్లలో మాత్రము ప్రత్తిధర చాల హెచ్చి, మిల్లులకు గిట్టుబాటు లేకుండెను.) బొంబాయి శీతోష్ణస్థితి, అచ్చటి చల్లనినీటిగాలి, వడకుటకు నేతకు అనుకూలములు; ప్రత్తి పండు జిల్లాలు దాని దగ్గర నున్నవి; అచ్చట ధనాఢ్యులు నుండిరి. ఇట్లు చాలమిల్లులు బొంబాయిలోనే యేర్పడెను.