పుట:2015.372412.Taataa-Charitramu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశముకు తెచ్చి, ఆంగ్లేయులు వానిని మనకు అమ్మ దొడగిరి.

మిల్లుయంత్రములందు తయారగు నూలు, బట్టలు, వడుకు నూలంత మన్నికగలవి కావు; కాని యవి సన్నగ నాజూకుగ గన్పడును; మరియు యంత్రములందు సమృద్ధిగ బహుళోత్పత్తి జరుగును, కనుక మిల్లుబట్టలు చౌకగ నుండును. వానినే మనదేశీయులు కొని వాడజొచ్చిరి. ఇట్లు పరిస్థితులు తారుమారై, బ్రిటిషు మిల్లుబట్టల చలామణి మనదేశమున 19 వ శతాబ్దిలో చాల హెచ్చినది. క్రమముగ వడకుట మున్నగు మనచేతి పనులు క్షీణించెను. ఆపనివాండ్లావృత్తుల గోల్పోయి, కూటికై యల్లాడజొచ్చిరి. అట్టి వృత్తిహీను లదృష్టవశమున కూలిదొరకిన భుజింతురు; లేనిచో, ఏకాదశీవ్రతఫల మనుభవింతురు.**[1]

తుదకు మన సాలీలు వడకువాండ్రుగూడ విదేశపు మిల్లుల సన్నబట్టల ధరించుటచే, అందుకు సొమ్మిచ్చుకొనుచుం

  1. * రొక్కపు రూపమున పోల్చినచో, చేతివడుకు నేతలచే ఒకనికివచ్చు ఆదాయము చాలతక్కువ (అది మిల్లుకూలికి తీసిపోవును) కాని ఆచేతిపనులను బీదలు తమయింటనే కొద్దిపాటి మూలధనముతో స్వేచ్ఛతో చేసుకొనవచ్చును; మరియు తమయితరకార్యములకు భంగములేకుండ, ఇంట స్త్రీలు బాలురుకూడ తీరికమైనప్పుడు నేసుకొనవచ్చును. ఇట్టి స్వతంత్రవృత్తి ప్రతివారికిని అందుబాటులోనుండును. కూలీలకు యజమానులకృపయే ఆధారము. యంత్రాలయముల పరిస్థితులు ననారోగ్యకరములు; కాని, జనులు చౌకయగు మిల్లుబట్టలనే అభిమానించిరి. అందుచే మనదేశములో వడుకుట నేత క్షీణించి మిల్లుబట్టలే వ్యాపించినవి.