పుట:2015.372412.Taataa-Charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోయిరి.*[1] అందువలన, ఎదురుసేనతో యుద్ధము లేకుండ మన సేననిర్నిరోధముగ బోయి, అప్పటి ముఖ్యనగరమగు 'మగ్డలా'ను పట్టుకొని, బ్రిటిషుఖైదీల విడిపించెను. ఇట్లు 1868 వేసవికిముందే, ఆజైత్రయాత్ర విచిత్రముగ నంతమయ్యెను.

మొదటపంపిన కొంచెముసామగ్రియే యాయాత్రకంతకు చాలెను. ఈగుత్తబేరమున పెద్దవాటాదారగు తాతాగారికందుచే మంచిలాభముకల్గెను. ఆద్రవ్యమును దేశమునకు తనకుగూడ లాభకరమైన వ్యాపారముకై వినియోగింపదలచి, తాతాగారంతట బట్టలమిల్లుల వ్యాపారముపై దృష్టినిమరల్చిరి.


__________
  1. * జాతీయమగు ప్రజాప్రతినిధుల రాజ్యాంగపద్ధతిలేకుండ పాలన కేవల మొకవ్యక్తిగతమగుచోట్ల నట్లేయగుటసహజము.