పుట:2015.372412.Taataa-Charitramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

తాతా చరిత్రము

రాజ్యముకు ఆంగ్లదేశముకు మధ్య (అట్లాంటికు అనబడు) విశాలమహోదధికలదు. ఇట్లు దక్షిణజిల్లాల తీరమునుండి యాంగ్లదేశముకు వచ్చు దూదియెగుమతి నిల్చిపోయి, బ్రిటనులో దూది కరువుగల్గెను; లంకషైరుమిల్లు లొక్కసారిగ నొల్చిపోయెను.*[1] అందుపై నాధారపడు నితరపరిశ్రమలును స్థంభించెను. లక్షలకొలది జనులకు వృత్తులుపోయి, దేశమున నలజడి గల్గెను.

అప్పుడాప్రత్తికరువు తీరుటకై, బ్రిటిషువారు మనదేశపు దూదిని ఖరీదుచేసి కొనిపోసాగిరి. ఈయెగుమతివలన మనదేశమున ప్రత్తిధర చాలహెచ్చి, ప్రత్తి యెగుమతికిస్థానమగు బొంబాయిలోని యావ్యాపారస్థులకు చాలలాభము రాదొడగెను. ఆవిధముగ తక్కిన బొంబాయివ్యాపారస్థులతోబాటు తాతా కంపెనీకిని చాల ద్రవ్యము చేకూరెను. ఆవ్యాపారపువృద్ధికై, జంషెడ్జి తాతా 1864 లో లండనుకు వెళ్ళెను.

హఠాత్తుగ గల్గిన యీలాభద్రవ్యముతో కొందరు బొంబాయి వర్తకులు ప్రావిడెంటుకంపెనీలరీతి కొత్తకంపెనీలను, విచిత్ర వ్యాపారములను, ఆరంభించిరి. ఈధనప్రవాహము చాలయేండ్లు వచ్చుననియే తలచి, వారనాలోచితముగ వర్తించిరి. అమెరికాలోని యాయుద్ధము, అందుచే బొంబాయికి లభించిన

  1. * ఆంగ్లదేశమే 'ఇంగ్లండు' అనబడును. ఇది దీని కుత్తరమందున్న స్కాట్లండుతో కలసి యేకద్వీపమై 'బ్రిటను' అనబడును. ఆ దేశీయులను 'బ్రిటిషు' వారని యందుము. లంకషైరు ఇంగ్లండులో నొకజిల్లా.