పుట:2015.372412.Taataa-Charitramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాతా చరిత్రము

7

బెహరమునుండి 12 వ తరపువాడు 'నస్సర్వంజి' ; ఆయన 1822 లో జనించి, బాల్యమున నవసారిలో మతవిద్య నేర్చుకొని, అంతట బొంబాయిపురము జేరి, అందు వర్తకము నేర్చుకొనెను. అతడు విద్వాంసుడు కాకున్నను, ప్రాజ్ఞుడు, సమయస్ఫూర్తిగలవాడు; మితవ్యయపరుడై కొంతసొమ్ము మిగుల్చుకొని, అందుతో నస్సర్వంజి వ్యాపారము చేసి, ద్రవ్య మార్జించెను. పూర్వాచారప్రకారము బాల్యమందే యతనికి వివాహమై, 1834లో నవసారిగ్రామమున, అతని యేకపుత్రుడగు మన 'జంషెడ్జి' జనించెను.

శైశవమునుండియు 'జంషెడ్జి' మంచి విద్యాసక్తి యుండెను.**[1] అప్పటికి నవసారిలోనున్న వీధిబడిలోనే జంషెడ్జి గుజరాతి, చరిత్ర, గణితము, మతవిద్య, నేర్చుకొనెను ; మనో గణితమం దాతని కభిలాషమెండు. నస్సర్వంజి తన కొడుకును నవసారిలో శుష్క వాదపరుడగు పురోహితునిగ నుంచక, 1852లో, ఉన్నత విద్యకై బొంబాయి కంపెను.

  1. * ఈక్రిందివృత్తాంత మాతనివిద్యాసక్తిని సూచించును. నవసారిలో తాతాయింటికొక మిద్దెయుండెను. ఆమిద్దెకు పైకప్పు తలకు తగులునట్లుండెను. జంషెడ్జి యందుకూర్చొని చదువుచుండగా, ఒకరోజున పెద్ద గాలివాన వచ్చి హోరున వర్షించెను ; గాలి విసురుకు భయపడి, అందరు నాయిల్లు విడచిరి. కాని బాలుడగు జంషెడ్జి మాత్రము దానిని సరకుచేయక తదేకదీక్షతో నా మిద్దపైననే చదువుకొనుచుండెను. ఈసంగతి తెలిసి, తండ్రి లోనికి పరువెత్తిపోయి, జంషెడ్జిని కష్టముతో నీవలకు తెచ్చెను. వా రీవలకు వచ్చిన కొద్దిక్షణములకే, ఆమిద్దెయిల్లు ఒక్క సారిగా నేలగూలెను.