పుట:2015.372412.Taataa-Charitramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

తాతా చరిత్రము

భారతీయార్యుల మూలగ్రంథము 'ఋగ్వేదసహిత' ' పారసీకార్యుల మూలగ్రంథము 'అవెస్తా' ; ఈరెంటిభాష, విషయములును, చాలవరకు పోలియున్నవి.

భారతీయార్యులు తరువాత చాల సుఖదు:ఖములకు లోనై, మనదేశమంతటను వ్యాపించి, చాల రాజ్యముల స్థాపించిరి. క్రమముగా, ఆర్యద్రావిడుల నాగరికతలు మిశ్రితములై నంతట, మన భారతీయనాగరికత యేర్పడినది; తరువాత కొన్ని శతాబ్దములకు మనము పూర్వపుటున్నతిని గోల్పోయి, తుదకు పరాధీనుల మైతిమి.

పారసీకార్యులును మొదట బలీయులై, వృద్ధినొందిరి; గొప్పరాజ్యముల స్థాపించిరి; వారిలో 'జొరాస్టరు' అనబడు జరాతుస్త్రుడు గొప్పమరమును స్థాపించెను. వారికిని నిత్యాగ్ని పూజ, ఉపనయనము, మౌంజీధారణము, ఇత్యాదిసంస్కారములు కలవు; వారిలోను గోమూత్రము పవిత్రముగ నెంచబడును.

ఇట్లుండగా పారసీకముకు పడమటనున్న 'అరేబియా' దేశములో క్రీ. త. 622 ప్రాంతమున 'మహమ్మదు' అను ప్రవక్త క్రొత్తమతము స్థాపించెను. ఆమతము నరబ్బులందరు నవలంబించి, దానిని లోకమంతటను వ్యాపింపజేయుటకై వీ రావేశముతో నలుదిశలను బయలుదేరిరి. వారిరణనీతి, మతోత్సాహము, అద్భుతములు. అం దొకశాఖవారు పారసీకముపై బడిరి; ఆవాహినిని క్రీ. త. 637 లో 'కడెస్సియా' యుద్ధమున పారసీకు లెదిర్చిరి.