పుట:2015.372412.Taataa-Charitramu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కానితాతా అనేకార్థికరాజ కీయసమస్యలను గృహమందును క్లబ్బులలోను దాదాభాయినౌరోజీ మెహతా వాచా మున్నగు రాజకీయనాయకులతోను వ్యాపారమిత్రులతోను చర్చించుచుండెను.

1885లో, జాతీయమహాసభ ఆరంభించినప్పటినుండి చనిపోవువరకును, జంషెడ్జి అందుసభ్యుడై హాజరగును, అందుకును బొంబాయి ప్రాంతీయరాజకీయసభకును చాలద్రవ్యమునిచ్చెను. రాజకీయములగూర్చి, ఆయనకు నిశ్చితాభిప్రాయములుండెను. ఆయన మితభాషియైనను, మెహతా వాచాలవలె మితవాది కాడు; దాదాభాయినౌరోజీవలె జాతీయభావము గల్గియుండెను. నాణెములపద్ధతి, వెండికి బంగారముకు ఉండదగు సంబంధము, దిగుమతిపన్నులు, మనమిల్లుసరుకులపై పన్నులు, బొంబాయి నివేశనపుపన్నులు, ప్రశస్తమగు ప్రత్తిసాగు, కార్మికసమస్య ఇట్టి సమస్యలగూర్చి ఆయనవ్రాసిన దీర్ఘ వ్యాసములు అమూల్యమగు ఆర్ధిక సిద్ధాంతముల చర్చతోగూడి, చక్కనిజాతీయ భావములతో నిండియున్నవి.

న్యాయవాదిత్వము మున్నగు వృత్తులకన్న పరిశ్రమల వృద్ధిచేయుటయే సంఘముకు, ముఖ్యముగ బీదలకు, హెచ్చుగ లాభకరము. పరిశ్రమలవృద్ధి దేశసంపదను వృద్ధిచేయును. అందుకవసరమగు జ్ఞానమును అనుభవమును ప్రత్యేకగుణములను జంషెడ్జి వృద్ధిచేసికొనెను. "భారతీయుల కవసరమై,