పుట:2015.372412.Taataa-Charitramu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిల్లులోని యంత్రము లెంతబాగుచేసినను పనికిరాక, ఆక్రయము మోసపు వ్యాపార మయ్యెను. బొంబాయి నివేశనములపైన బట్టలపైన ప్రభుత్వమువారు పన్ను విధించినప్పుడు, ఆయన కధికారులతో తీవ్రవివాదము కలిగెను. అందు ప్రభుత్వోద్యోగులు న్యాయపద్ధతికి కట్టుబడలేదు. చాలవ్యయప్రయాసలకు లోనై, తాతా లోహపరిశ్రమ స్థాపనకై మధ్యరాష్ట్రపు చందాగనులందు వ్యాపార మారంభింపబోగా, ప్రభుత్వమువారు వానిని కౌలుకిచ్చుటకు నిరాకరించిరి. ఆయాపరిశ్రమల యారంభమున, ముందుగా వేలకొలది రూపాయల ఖర్చుతో, విశేషశ్రమకు లోనై, దీర్ఘ పరిశోధనలజేసి, జాగ్రత్తతో నెన్నియో విఘ్నముల నెదుర్కొనవలసివచ్చెను. జపాను నావికులతో కలసి ఓడవ్యాపారము జరిపినప్పుడు, తన మిత్రులగు బొంబాయి వర్తకులు ద్రోహమొనర్ప, ఆవ్యాపారము భగ్నమయ్యెను. అట్టి క్లిష్టసమయములందుగూడ, ఆయన వెనుదీయక, న్యాయబుద్ధితోను ధైర్యోత్సాహములతోను నిరంతరము కృషిచేసి, కష్టములను తుదకు దాటగల్గెను. "విఘ్నై: పున:పునరపి ప్రతిహన్యమానా: ప్రారబ్ధముత్తమగుణా నపరిత్యజంతి" అను సుభాషిత మాయనకు చక్కగ వర్తించును.

వ్యాపారదక్షత ఆయనలో మూర్తీభవించినది. అది కొంతవరకు పార్సీలందరికిని సామాన్యగుణము. కాని ఆయనప్రజ్ఞ మహాప్రతిభగ పరిణమించి, వ్యాపారమందారితేరిన పాశ్చాత్యనా